- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలీస్ స్టేషన్ ముందు బాధితుల ఆందోళన
దిశ, జహీరాబాద్ : జహీరాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ లో వారం రోజుల క్రితం నమోదైన ఓ దాడి కేసుకు సంబంధించి నిందితుల రిమండ్ లో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు.

X
దిశ, జహీరాబాద్ : జహీరాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ లో వారం రోజుల క్రితం నమోదైన ఓ దాడి కేసుకు సంబంధించి నిందితుల రిమండ్ లో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. పోలీస్ అధికారులు కల్పించుకొని సత్వరమే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మండలంలోని హుగ్గెల్లి గ్రామంలో పంచాయతీ ఎన్నికల అనంతరం ఓ వర్గం వ్యక్తులు మరో వర్గానికి చెందిన వారిపై దాడి చేసారు. ఈ దాడుల నేపథ్యంలో నిందితుల రిమాండ్ పట్ల ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంజీ. రాములు, గ్రామస్తులు, నిందితులతో కలిసి పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆందోళనకు దిగారు. దీంతో డీఎస్పీ సైదా , సీఐ శివలింగం, పట్టణ ఎస్ఐ వినయ్ కుమార్ నిందితులపై చట్టపరమైన చర్యలు తప్పవని సర్ది చెప్పడంతో ఆందోళన విరమించారు.
Next Story






