- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
న్యాయవాదుల రక్షణ చట్టం రావాలి : సీనియర్ న్యాయవాది రాపోలు భాస్కర్
దిశ, మెదక్ టౌన్ : రాష్ట్రంలో పని చేస్తున్న 50 వేల మంది న్యాయవాదుల కోసం రక్షణ చట్టం అమలు చేయాలని సీనియర్ అడ్వకేట్, బార్ తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యునిగా

దిశ, మెదక్ టౌన్ : రాష్ట్రంలో పని చేస్తున్న 50 వేల మంది న్యాయవాదుల కోసం రక్షణ చట్టం అమలు చేయాలని సీనియర్ అడ్వకేట్, బార్ తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యునిగా పోటీలో ఉన్న రాపోలు భాస్కర్ డిమాండ్ చేశారు. గురువారం మెదక్ జిల్లా కోర్టులో న్యాయవాదులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. రెండు సంవత్సరాలకు ఒక సారి జరగాల్సిన కౌన్సిల్ ఎన్నికలు గత ఏడున్నర సంవత్సరాలుగా జరగకపోవడం శోచనీయమన్నారు. 2026 జనవరి 31 లోగా ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశాలతో గత్యంతరం లేక ఎన్నికలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. 25 మంది కౌన్సిల్ సభ్యులు, అందులో నుంచి చైర్మన్ ఎన్నుకున్నట్లయితే న్యాయవాదుల సంక్షేమం, దోహదపడుతుందన్నారు. రాష్ట్రంలో పని చేస్తున్న న్యాయవాదులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా సమయంలో అడ్వకేట్ల కు 25 కోట్ల ఇప్పించడం జరిగిందన్నారు.
రాష్ట్రంలోని జూనియర్ న్యాయవాదులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని, వారి సంక్షేమం, ఆర్థిక భద్రత కోసం నెలకు 5 నుంచి 10 వేల వరకు స్టైఫండ్ ఇవ్వాలని, ఇందుకోసం ప్రయత్నం చేస్తానన్నారు. జూనియర్ న్యాయవాదుల నైపుణ్యాభివృద్ధి కోసం, హైదరాబాద్ లో నా సొంత నిధులతో లీగల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి, నిరంతర శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తానన్నారు. ప్రతి రెండు నెలలకు ఒకసారి, కొత్త చట్టాలు, చట్ట సవరణలు, ముఖ్యమైన కోర్టు తీర్పులపై, ప్రముఖ న్యాయవాదులు న్యాయమూర్తులతో సెమినార్లు అన్ని జిల్లాల కోర్టు సముదాయాల్లో నిర్వహించుటకు కృషి చేస్తానన్నారు. న్యాయవాదుల సంక్షేమం, ఆరోగ్య భద్రత కోసం ఆరోగ్య బీమా పరిమితిని 2 లక్షల నుంచి 5 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఇండ్లు లేదా స్థలాలు లేని ఆర్థికంగా వెనుకబడిన న్యాయవాదులకు ఇళ్లు, ఇల్లు స్థలాలు ప్రభుత్వం కేటాయించాలన్నారు.
బార్ కౌన్సిల్ పరిపాలన పారదర్శకత కోసం ప్రతి 6 నెలలకు ఒకసారి ఆదాయ - వ్యయాలపై శ్వేతపత్రం విడుదల చేయడానికి కృషి చేస్తాను. 2019 నుంచి నమోదైన న్యాయవాదులందరికీ హెల్త్ కార్డులు, అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ రాని న్యాయవాదులు కూడా స్టాండింగ్ నిబంధన లేకుండా తగిన ఫీజుతో లబ్ధి పొందేలా కృషి చేస్తానన్నారు. 41ఏ లేదా బీఎన్ఎస్ఎస్ 35 యొక్క దుర్వినియోగం నియంత్రించేందుకు కృషి చేస్తానని భాస్కర్ పేర్కొన్నారు. నోటరీ నోటిఫికేషన్ విడుదల, నోటరీ అపాయింట్ మెంట్ కోసం కృషి చేస్తాని తెలిపారు. 60 సంవత్సరాలు దాటిన సీనియర్ అడ్వకేట్ కు పెన్షన్ లేదా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించాలని, న్యాయవాదులందరికీ మరణానంతర లబ్ధిని 20 లక్షలకు పెంపుతో పాటు కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల మేనిఫెస్టోలో న్యాయవాదులకు ఇచ్చిన హామీలను త్వరితగతిన అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు రాములు, సీనియర్ న్యాయవాది కొప్పుల పోచయ్య పాల్గొన్నారు.






