ప్రైవేటు విద్యాసంస్థ ప్రారంభోత్సవంలో సినీనటి నిధి అగర్వాల్ సందడి

by Kodari Anjali |

జహీరాబాద్ పట్టణ ఓ ప్రైవేటు విద్యాసంస్థ ప్రారంభోత్సవంలో సినీనటి నిధి అగర్వాల్ సందడి చేశారు.

ప్రైవేటు విద్యాసంస్థ ప్రారంభోత్సవంలో సినీనటి నిధి అగర్వాల్ సందడి
X

దిశ, జహీరాబాద్: జహీరాబాద్ పట్టణ ఓ ప్రైవేటు విద్యాసంస్థ ప్రారంభోత్సవంలో సినీనటి నిధి అగర్వాల్ సందడి చేశారు. ఆమెతో పాటు సినీ దర్శకుడు హరీష్ శంకర్ కూడా పాల్గొన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్యే కె.మాణిక్ రావు, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ ఎం.శివకుమార్, మున్సిపల్ చైర్మన్ ఎండీ. యూనూస్, వైస్ ఛైర్మన్ శిరీషారెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ.. చక్కటి వసతులతో కూడిన విద్యాలయంలో విద్యార్థుల బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దాలన్నారు. ఆధునీకరణను జోడిస్తూ మంచి విద్యను విద్యార్థులకు అందించాలని కోరుతూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు సర్దారభాషా, సుధీష్న, ప్రిన్సిపల్ వినీల, విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానికులు పాల్గొన్నారు.

Next Story