ఎన్నికల విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు

by Disha Web Desk 22 |
ఎన్నికల విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని పోలీస్ కమిషనర్ అనురాధ హెచ్చరించారు. పోలీస్ కమిషనరేట్‌లో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పోలీసు అధికారుల ఎన్నికల విధులు విధానాలు, బందోబస్తు తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ… ఫ్రీ అండ్ ఫేర్‌గా ఎన్నికలు జరిగేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో పని చేయాలన్నారు. పోలింగ్ కేంద్రంల్లో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకునే విధంగా రెవెన్యూ అధికారులతో కలిసి అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు.

అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. నగదు, మద్యం పై ఉచిత పంపిణీల పై ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. ఎన్నికల సందర్భంగా జరిగే ప్రతి సంఘటననూ వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ తీసుకోవాలన్నారు. రాజకీయ నాయకులు నిర్వహించే సభలు, సమావేశాలు ఇంటింటి ప్రచారం పై నిఘా ఉంచాలన్నారు. ఎస్ఐలు, సీఐలు, ఏసీపీలు, క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను సందర్శించాలని సూచించారు. అనంతరం విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులకు పోలీస్ కమిషనర్ అనురాధ ప్రభుత్వ సేవా పథకాలను అందజేశారు. సమావేశంలో అడిషనల్ డీసీపీ ఎస్ మల్లారెడ్డి, ఏఆర్ అడిషనల్ డీసీపీలు రాంచందర్రావు, సుభాష్ చంద్రబోస్, ఏసీపీలు మధు, పురుషోత్తం రెడ్డి, సతీష్, సుమన్ కుమార్, రవీందర్, శ్రీనివాస్, ఎస్బీ ఇన్స్ స్పెక్టర్ కిరణ్, ఎలక్షన్ సెల్ ఇన్స్ స్పెక్టర్ శ్రీధర్ గౌడ్, సీసీ ఆర్బీ ఇన్స్ స్పెక్టర్ గురుస్వామి, సీఐలు, ఎస్ఐలు, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Next Story