గుడ్లు సరఫరా కాంట్రాక్టర్ పైన చర్య తీసుకోవాలి.. సీపీఎం ఏరియా కన్వీనర్

by Disha Web Desk 20 |
గుడ్లు సరఫరా కాంట్రాక్టర్ పైన చర్య తీసుకోవాలి.. సీపీఎం ఏరియా కన్వీనర్
X

దిశ, నారాయణఖేడ్ : నారాయణఖేడ్ ప్రాజెక్టు పరిధిలోని కల్లేరు మండలంలో మార్డి గ్రామంలో అంగన్వాడి సెంటర్ సంబంధించిన గుడ్లను రోజు వాడుకునే బాత్రూంలో దించడం పట్ల స్థానిక ప్రజలు తీవ్రంగా ఖండించారు. ప్రజలకు గర్భిణీ స్త్రీలకు, పెద్దా, చిన్న పిల్లలకు సరఫరా చేయాల్సిన గుడ్లను బాత్రూంలో దించడం పట్ల సీపీఎం ఏరియా కన్వీనర్ చిరంజీవి తీవ్రంగా ఖండించారు.

అక్కడ స్థానికంగా ఉన్న టీచర్స్ వారికి సంబంధించిన కార్యాలయంలో మీటింగ్ ఉండడంతో గుడ్ల టెండర్ అతను బాత్రూంలో దించడం ఏంటని ప్రశ్నించారు. ప్రజల పట్ల ఇంత నిర్లక్ష్యం వహిస్తున్న కాంట్రాక్టర్ పైన చర్య తీసుకోవాలన్నారు. 50 గ్రాముల కంటే తక్కువ బరువు ఉన్న గుడ్లు సరఫరా చేస్తున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు కళ్ళు తెరిచి కాంట్రాక్టర్ పైన చర్యలు తీసుకోవాలని కోరారు.


Next Story

Most Viewed