మైనర్ బాలికపై అత్యాచారం నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష

by Taduka Kalyani |

సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి సంగారెడ్డి ప్రత్యేక పోక్సో ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది.

మైనర్ బాలికపై అత్యాచారం నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష
X

దిశ, సంగారెడ్డి అర్బన్: సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి సంగారెడ్డి ప్రత్యేక పోక్సో ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్‌లో క్రైం నెం.103/2025గా, బీఎన్‌ఎస్ సెక్షన్ 65(2)తో పాటు పోక్సో చట్టం-2012లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణ అనంతరం ప్రత్యేక పోక్సో ఎఫ్‌టీఎస్ న్యాయమూర్తి ఆర్. శ్రీలేఖ నిందితుడు సదాశివపేట కు చెందిన మహమ్మద్ కలీం పాషా అలియాస్ నవీద్( 25), ను దోషిగా నిర్ధారించారు.కోర్టు నిందితుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10,000 జరిమానా విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో రెండు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని ఆదేశించింది.ఈ కేసులో సమర్థవంతంగా వాదనలు వినిపించిన ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ బి. సుర్‌రెడ్డి, బాధితురాలికి న్యాయ సహాయం అందించిన భరోసా కేంద్రం లీగల్ కౌన్సిలర్ ఎస్. అపర్ణ, దర్యాప్తు నిర్వహించిన అప్పటి ఎస్‌ఐ పి. రవీందర్, అప్పటి సీఐ ఎస్. క్రాంతి కుమార్, ప్రస్తుతం సంగారెడ్డి రూరల్ ఎస్‌హెచ్‌ఓ ఎస్. మధుసూదన్ రెడ్డి, కోర్టు లైజనింగ్ అధికారులు, సిబ్బంది చేసిన కృషిని అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి ఐపీఎస్ అభినందించారు.

Next Story