- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దొంగతనం కేసులో నిందితుడి అరెస్ట్
దొంగతనం కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి రూ.9,50,000 లక్షల నగదు, లక్షన్నర విలువ చేసే మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు గజ్వేల్ పోలీసులు.

దిశ, గజ్వేల్ రూరల్ : దొంగతనం కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి రూ.9,50,000 లక్షల నగదు, లక్షన్నర విలువ చేసే మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు గజ్వేల్ పోలీసులు. వివరాల్లోకి వెళితే ప్రజ్ఞాపూర్ శివారులో గల ఫిర్యాదుదారుడు సుశీల్ కుమార్ అగర్వాల్ యొక్క స్టీల్ ఫ్యాక్టరీ ఆఫీసులో గత సంవత్సరం డిసెంబర్ 22న రాత్రి ఎవరో గుర్తుతెలియని దొంగలు ఆఫీస్ తలుపులు పగలగొట్టి లోనికి వెళ్లి డ్రా తాళం పగలగొట్టి అందులో ఉన్నటువంటి రూ.13 లక్షలు దొంగలించారని పిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసిన గజ్వేల్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గజ్వేల్ ఏసీపీ నేతృత్వంలో గజ్వేల్ ఎస్.హెచ్.ఓ రవికుమార్, ఇన్స్పెక్టర్ చెట్టు కింద ముత్యం రాజు వారి టీమ్ సభ్యులు యాదగిరి ఏఎస్ఐ, నరేందర్, వెంకటేష్, రవి, సురేందర్ దివ్య దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో నేరస్తుడు అయినటువంటి ఉత్తర ప్రదేశ్ కి చెందిన రాహుల్ కుమార్ ను పట్టుకొని అరెస్టు చేసి అతని వద్ద నుంచి రూ. 9,50,000 లక్షల నగదు ఒక లక్ష యాభై వేలు విలువ చేసే ఐఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం శనివారం నిందితుడిని జ్యుడీషియల్ రిమాండ్ కు పంపించినట్టు సీఐ తెలిపారు.






