ప్రమాదవశాత్తు పెంకుటిల్లు దగ్ధం..

by Kodari Anjali |

ప్రమాదవశాత్తు పెంకుటిల్లు దగ్ధం అయి రూ. 3 లక్షల ఆస్తి నష్టం జరిగిందని బాధితుడు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

ప్రమాదవశాత్తు పెంకుటిల్లు దగ్ధం..
X

దిశ, అల్లాదుర్గం: ప్రమాదవశాత్తు ఇల్లు దగ్ధమై రూ. 3 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిన ఘటన అల్లాదుర్గం మండలం సీతానగర్ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్సై శంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. సీతానగర్ గ్రామానికి చెందిన నల్లచెరువు నాగయ్య ఇంటికి గురువారం రాత్రి సమయంలో మంటలు చెలరేగడంతో ఇంటిలోని విలువైన నగదు, గృహ పరికరాలు, వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాదంలో మూడు లక్షల ఆస్తి నష్టం జరిగిందని, స్థానిక పోలీస్ స్టేషన్‌లో బాధితుడు నాగయ్య ఫిర్యాదు చేశారు. ఎస్సై శంకర్ సంఘటన స్థలానికి చేరుకొని అగ్ని ప్రమాదంపై విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శంకర్ తెలిపారు.

Next Story