- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జేసీబీ ఢీకొని యువకుడు మృతి
దిశ, జిన్నారం : గుమ్మడిదల పురపాలక సంఘం పరిధిలోని బొంతపల్లి పారిశ్రామికవాడలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.

X
దిశ, జిన్నారం : గుమ్మడిదల పురపాలక సంఘం పరిధిలోని బొంతపల్లి పారిశ్రామికవాడలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. గ్రాన్యూల్స్ పరిశ్రమ ఆవరణలో నుంచి బయటకు వస్తున్న జేసీబీ వాహనం ఒక స్కూటీని ఢీకొనడంతో విశాల్ (21) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పారిశ్రామిక వాడ ప్రధాన రహదారికి ఇరువైపులా లారీలు, భారీ వాహనాలు యథేచ్ఛగా నిలపడమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశ్రమల వద్ద భద్రతా చర్యలు పాటించకపోవడాన్ని తీవ్రంగా విమర్శించారు. మృతి చెందిన విశాల్ తండ్రి శ్రీనివాస్ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్ఐ లక్ష్మీకాంత్ రెడ్డి తెలిపారు.
Next Story






