- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కలహాలతో యువకుడు ఆత్మహత్య
కుటుంబ కలహాలతో మనస్థాపం చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకో కొన్న సంఘటన బుధవారం కొల్చారం మండలం అప్పాజీ పల్లి లో జరిగింది. ఎస్సై సారా శ్రీనివాస్ గౌడ్ గ్రామస్తులకు కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

దిశ కొల్చారం: కుటుంబ కలహాలతో మనస్థాపం చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకో కొన్న సంఘటన బుధవారం కొల్చారం మండలం అప్పాజీ పల్లి లో జరిగింది. ఎస్సై సారా శ్రీనివాస్ గౌడ్ గ్రామస్తులకు కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన రైతు కన్నెబోయిన ఏగొండ (35) కుటుంబ కలహాలతో బుధవారం ఉదయం గ్రామ సమీపంలోని చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గత రెండు సీజన్లుగా వ్యవసాయం లో సరైన దిగుబడులు రాక పంట పెట్టుబడి కోసం చేసిన అప్పులు ఎక్కువయ్యాయి. దీంతో తరచూ కుటుంబ కలహాలు జరుగుతుండడంతో మనస్థాపానికి గురైన ఏగొండ తెల్లవారుజామున గ్రామ శివారులో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య రేణుక, కుమారుడు మహేష్, కూతురు శ్రీనిత ఉన్నారు.మృతుని భార్య రేణుక ఫిర్యాదు మేరకు కొల్చారం ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించారు.






