- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హోంగార్డులపై వరాల జల్లు
63వ హోంగార్డ్స్ రైసింగ్ డేను పురస్కరించుకొని, జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో రైసింగ్ పరేడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ హోంగార్డ్స్ గౌరవ వందనం స్వీకరించారు.

దిశ ,సంగారెడ్డి అర్బన్: 63వ హోంగార్డ్స్ రైసింగ్ డేను పురస్కరించుకొని, జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో రైసింగ్ పరేడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ హోంగార్డ్స్ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ ప్రజల రక్షణ, అంతర్గత భద్రతలో పోలీస్ శాఖకు తోడ్పాటు అందించాలనే లక్ష్యంతో 1946 డిసెంబర్ 6న ఏర్పాటైనదే హోంగార్డ్ వ్యవస్థ అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో శాంతి–భద్రతల పరిరక్షణలో, ట్రాఫిక్ సమస్యల పరిష్కారంలో పోలీసు శాఖ చేస్తున్న కృషికి అదనపు బలం అందించేందుకు స్వచ్ఛంద సేవా భావంతో పనిచేసే, శిక్షణ పొందిన సిబ్బందే హోంగార్డ్స్ అని వెల్లడించారు. హోంగార్డ్స్ కూడా పోలీస్ వ్యవస్థలో భాగమని, వారి సంక్షేమానికి పోలీసు శాఖ కట్టుబడి ఉందని అన్నారు. హోంగార్డ్స్ సిబ్బంది రోజువారీ వేతనాన్ని రూ,921 నుండి రూ.1000కి పెంచడం, పరేడ్ అలవెన్స్‌ను రూ.100 నుండి రూ.200కు పెంచడం జరిగిందని, ఆరోగ్య పరిరక్షణ కోసం ఆక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సహకారంతో రూ.33 లక్షల హెల్త్ కవరేజ్ అందించబడుతోందని తెలిపారు.
పోలీసు సిబ్బందితో సమానంగా రైన్ కోట్, ఉలెన్ జాకెట్ వంటి అవసరమైన సామగ్రి అందించడం జరుగుతుందని, యాక్సిడెంటల్ భీమా ప్రయోజనాలు అందిస్తూ రాష్ట్రవ్యాప్తంగా సాధారణ, అసాధారణ మరణం పొందిన 23-మంది హోంగార్డ్ కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా మంజూరు చేయడం జరుగుతుందని వెల్లడించారు. పోలీస్ శాలరీ ప్యాకేజ్‌లో భాగంగా యాక్సిడెంటల్ డెత్‌కురూ.30 లక్షలు, ఇద్దరు పిల్లల చదువుకోసం ఒక్కొక్కరికి రూ.2 లక్షలు ఆర్థిక ప్రయోజనం కల్పించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అలాగే రాజీవ్ ఆరోగ్య శ్రీ మెడికల్ సర్వీసుల కోసం ప్రతిపాదన పరిశీలనలో ఉందని తెలిపారు. అర్హత కలిగిన హోంగార్డ్ సిబ్బందికి డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల మంజూరుపై పరిశీలన కొనసాగుతోందని, త్వరలో కొత్త హోంగార్డ్స్ నియామకాలు చేపట్టడానికి సన్నహకాలు జరుగుతున్నాయని అన్నారు.
పోలీస్ కానిస్టేబుళ్లకు ఏమాత్రం తీసిపోకుండా, మీకు అప్పగించిన విధులను సమర్థవంతంగా నిర్వహించి, ఉన్నతాధికారుల ప్రశంసలు పొందాలని, విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ చూపిన హోంగార్డ్ సిబ్బందిని రివార్డ్స్ ద్వారా ప్రోత్సహించడం జరుగుతుంది అన్నారు. అనంతరం విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందికి ప్రశంసాపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రఘునందన్ రావ్, ఎఆర్ డిఎస్పీ నరేందర్, ఆర్ఐలు రామారావ్, డానియెల్, రాజశేఖర్ రెడ్డి, సంగారెడ్డి టౌన్ ఇన్స్పెక్టర్ రాము నాయుడు, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ రమేష్ తదితరులు ఉన్నారు.
- Tags
- medak news






