- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంట్లో గొడవపడి.. బావిలో దూకిన వివాహిత మహిళా
by Ratna Kumari |
ఫిట్స్ వ్యాధితో ఓ వివాహిత మహిళ ఇంట్లో గొడవపడి శుక్రవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఇంటి నుండి వెళ్లిపోయి బావిలో పడిన సంఘటన చోటుచేసుకుంది.

X
దిశ, చిన్నశంకరంపేట : ఫిట్స్ వ్యాధితో ఓ వివాహిత మహిళ ఇంట్లో గొడవపడి శుక్రవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఇంటి నుండి వెళ్లిపోయి బావిలో పడిన సంఘటన చోటుచేసుకుంది. గ్రామస్తులు, ఉపాధి కూలీల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన మల్గ రేణుక (30). ఫిట్స్ వ్యాధితో బాధపడుతోంది. ఆమె కుటుంబ సభ్యులతో గొడవ పడి మండల కేంద్రంలోని సంగారెడ్డి బావిలో దూకింది. అక్కడే ఉపాధి పనులు నిర్వహిస్తున్న కూలీలు గమనించి కొంత మంది బావిలోకి దిగి నీటి నుంచి ఒడ్డుకి చేర్చారు. పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి బావిలోకి నిచ్చెన సహాయంతో బయటికి తీసి.. 108 అంబులెన్స్ ద్వారా మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






