కూతురు వివాహానికి అప్పు దొరకలేదని వ్యక్తి ఆత్మహత్య

by Kema Shiva Kumar |

కూతురు వివాహానికి అప్పు పుట్టకపోవడంతో పురుగుల మందు తాగి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని కూటిగల్ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది.

కూతురు వివాహానికి అప్పు దొరకలేదని వ్యక్తి ఆత్మహత్య
X

దిశ, మద్దూరు, దూల్మిట్ట: కూతురు వివాహానికి అప్పు పుట్టకపోవడంతో పురుగుల మందు తాగి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని కూటిగల్ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నల్ల ఉప్పలయ్య (52)తన రెండో కుమార్తెకు ఇటీవల నిశ్చితార్థం కాగా వివాహాం జరిపించేందుకు అప్పు ఎక్కడా దొరకలేదు. దీంతో మనస్తాపానికి గురైన ఉప్పలయ్య శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో మద్యంలో పురుగుల మందు కలుపుకొని తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మద్దూరు ఎస్సై నారాయణ తెలిపారు.

Next Story