- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రంగనాయక సాగర్ ను సందర్శించిన అబుదాబి ప్రతినిధుల బృందం
చిన్నకోడూరు మండల పరిధిలోని రంగనాయక సాగర్ ను అబుదాబి, కువైట్ ప్రతినిధుల బృందం శుక్రవారం సందర్శించారు.

దిశ, చిన్నకోడూరు : మండల పరిధిలోని రంగనాయక సాగర్ ను అబుదాబి, కువైట్ ప్రతినిధుల బృందం శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా రంగనాయక సాగర్ ప్రాజెక్టు, అండర్ గ్రౌండ్ నిర్మాణాల పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. మెగా ఇంజనీరింగ్ కంపెనీకి అబుదాబి లో ప్రాజెక్టు నిర్మాణం కోసం అక్కడి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ఈ సందర్భంగా ఇండియా లోని తెలంగాణ రాష్ట్రంలో నిర్మించిన కాలేశ్వరం ప్రాజెక్టులో భాగంగా అబుదాబి అధికారం బృందం రంగనాయక సాగర్ ను సందర్శించి, ప్రాజెక్టు వివరాలు అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అబుదాబి అధికార బృందం హెచ్ఇ డా. అబ్దుల్లా హుమైద్ (సైఫ్ అల్ జర్వాన్ అల్ షమ్సీ, ఎనర్జీ-అబుదాబి విభాగం ఛైర్మన్,) అబ్దెల్‌రహ్మాన్ అహ్మద్ యూసిఫ్ మొహమీద్ అల్హమ్మది లీడ్ ప్రాజెక్ట్ మేనేజర్, డాక్టర్ అహ్మద్ అబ్దేల్మౌటి, సీనియర్ సలహాదారు, మజీద్ బిన్ కువైట్, సలహాదారు, హమ్జా మెరౌనే బెనాబిడ్ ప్రధాన న్యాయ సలహాదారు, సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి, రూరల్ సీఐ విద్యాసాగర్, ఎస్సై చంద్రమోహన్, మెగా కంపెనీ ప్రతినిధుల బృందం పాల్గొన్నారు.






