- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోర్టు హాల్లోకి నాగుపాము.. అప్రమత్తమైన సిబ్బంది
దుబ్బాక కోర్టు హాల్లో సోమవారం నాగుపాము ప్రత్యక్షమవడంతో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి.

దిశ, దుబ్బాక: దుబ్బాక కోర్టు హాల్లో సోమవారం నాగుపాము ప్రత్యక్షమవడంతో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. రోజువారీ కోర్టు కార్యకలాపాల్లో భాగంగా మధ్యాహ్నం ట్రయల్ కేసుల విచారణలు కొనసాగుతున్న సమయంలో ఓ నాగుపాము నేరుగా కోర్టు హాల్లోకి చొరబడింది. విచారణలో నిమగ్నమైన న్యాయమూర్తి, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పామును గమనించడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. నాగుపాము కోర్టు హాలులో సంచరించడంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా ఎవరినైనా కాటు వేసే ప్రమాదం ఉండటంతో అక్కడున్న వారంతా అప్రమత్తమయ్యారు. వెంటనే స్థానికుల సహాయంతో పామును చంపేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో కొంతసేపు కోర్టు హాల్లో ఆందోళనకర వాతావరణం నెలకొంది. అనంతరం కోర్టు భవనం పరిసరాలను అధికారులు పరిశీలించారు. భవనం చుట్టూ పెరిగిన గడ్డి, పేరుకుపోయిన చెత్త కారణంగానే పాములు సంచరించే అవకాశం ఉందని జడ్జి జితేందర్ భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కోర్టు ఆవరణను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు అవసరమైన భద్రతా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.






