సిద్దిపేట జిల్లాలో యువ‌తి దారుణ హ‌త్య

by Ratna Kumari |   (  Updated:2026-01-01 10:39:34  IST  )

దిశ‌, వ‌ర్గ‌ల్ : సిద్దిపేట జిల్లాలో ఓ యువ‌తి దారుణ హ‌త్య‌కు గురైంది. అనారోగ్య కార‌ణాల‌తో హెల్త్ చెక‌ప్ కోసం హైద‌రాబాద్ వెళ్తున్నాన‌ని చెప్పి ఇంటి నుంచి బ‌య‌లుదేరింది.

సిద్దిపేట జిల్లాలో యువ‌తి దారుణ హ‌త్య
X

దిశ‌, వ‌ర్గ‌ల్ : సిద్దిపేట జిల్లాలో ఓ యువ‌తి దారుణ హ‌త్య‌కు గురైంది. అనారోగ్య కార‌ణాల‌తో హెల్త్ చెక‌ప్ కోసం హైద‌రాబాద్ వెళ్తున్నాన‌ని చెప్పి ఇంటి నుంచి బ‌య‌లుదేరింది. అంత‌లోనే హ‌త్య‌కు గురైది. ఈ ఘ‌ట‌న సిద్దిపేట జిల్లా వ‌ర్గ‌ల్ మండ‌ల ప‌రిధిలోని నాచారం గ్రామంలో క‌ల‌క‌లం రేపింది. గ‌జ్వేల్ రూర‌ల్ సీఐ మ‌హేంధ‌ర్ రెడ్డి తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. తూఫ్రాన్ మండ‌లం ఇస్లాంపూర్ గ్రామానికి చెందిన జోడు న‌ర్సింహులు కుమార్తె మంతూర్ క‌ల్ప‌న (26) కు ఆరేళ్ల క్రితం క‌న్యారం గ్రామాణికి చెందిన గ‌ణేష్ తో వివాహం జ‌రిగింది. గ‌త ఆరు నెల‌లుగా భ‌ర్త‌తో గొడ‌వ‌లు జ‌రుగుతుండ‌టంతో ఆమె ఇస్లాంపూర్ లోని త‌ల్లిగారి ఇంటివ‌ద్ద‌నే ఉంటున్నారు. ఈ క్ర‌మంలో డిసెంబ‌ర్ 30వ తేదీ సాయంత్రం హెల్త్ చెక‌ప్ కోసం హైద‌రాబాద్ వెళ్తున్నాన‌ని ఇంట్లో చెప్పి వెళ్లింఇ. అయితే డిసెంబ‌ర్ 31 అర్థ‌రాత్రి స‌మ‌యంలో ఎవ్వ‌రో గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు ఆమె మెడ‌కు వైర్ గ‌ట్టిగా బిగించి హ‌త్య చేసి.. మృత‌దేహాన్ని నాచారం గ్రామ శివారులో ప‌డేశారు. మృతురాలు తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు హ‌త్య కేసుగా న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేప‌డుతున్న‌ట్టు సీఐ మ‌హేంద‌ర్ రెడ్డి తెలిపారు.

Next Story