- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అదుపుతప్పి చెట్టును ఢీకొన్న బైక్.. వ్యక్తి మృతి
by Taduka Kalyani |
బైక్ పై భార్యతో కలిసి స్వగ్రామానికి తరలి వెళ్తుండగా అదుపుతప్పి చెట్టుకు ఢీకొనడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని బోనాల కొండాపూర్ గ్రామ శివారులో చోటుచేసుకుంది.

X
దిశ, చేగుంట: బైక్ పై భార్యతో కలిసి స్వగ్రామానికి తరలి వెళ్తుండగా అదుపుతప్పి చెట్టుకు ఢీకొనడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని బోనాల కొండాపూర్ గ్రామ శివారులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అక్బర్పేట్ మండలం కాజీపూర్ గ్రామానికి చెందిన దుబ్బ రాజం(55), భార్య స్వరూపతో కలిసి దౌల్తాబాద్ గ్రామం నుంచి తిరిగి కాజీపూర్ వెళ్తుండగా అదుపుతప్పి బైక్ చెట్టుకు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దుబ్బరాజం అక్కడికక్కడే మృతి చెందగా తీవ్ర గాయాల పాలైన భార్య స్వరూపను ఆసుపత్రికి తరలించారు.
Next Story






