- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సిద్ధిపేట జిల్లాలో 88.36 శాతం పోలింగ్ నమోదు
దిశ, సిద్దిపేట ప్రతినిధి : రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా

దిశ, సిద్దిపేట ప్రతినిధి : రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా ముగిశాయి. అక్బర్ పేట, భూంపల్లి, బెజ్జంకి, చిన్నకోడూరు, దుబ్బాక, మిరుదొడ్డి, నంగునూరు, నారాయణరావు పేట, సిద్దిపేట రూరల్, సిద్దిపేట అర్బన్, తొగుట మండల పరిధిలోని 182 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్ జారీ కాగా 10 గ్రామ పంచాయతీలు ఏక గ్రీవం అయ్యాయి. 172 గ్రామ పంచాయతీల్లో 684 మంది బరిలో ఉన్నారు. 10 మండలాల పరిధిలో పురుషులు 1,19,471 మంది, మహిళాలు 1.25,304, ఇతరులు 1 మొత్తం 2,44,776 ఉన్నారు. మధ్యాహ్నం పోలింగ్ ముగిసిన తర్వాత పురుషులు 1,06,360 (89.03 శాతం), మహిళలు 1,09, 934 (87.73 శాతం) మొత్తం 2,16,294 (88.36 శాతం) ఓటు హక్కు వినియోగించుకున్నారు. సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్ పల్లి, పొన్నాల, సిద్దిపేట రూరల్ మండలం వెంకటాపూర్, రాఘవాపూర్, మిరుదొడ్డి మండలం కేంద్రంతో పాటుగా, అల్వాల్, దుబ్బాక మండలం హబ్సీపూర్, పెద్ద గుండవెల్లి, నంగునూరు మండలం పాలమాకుల గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ కే హైమావతి సందర్శించి పోలింగ్ తీరును పరిశీలించారు.
పోలింగ్ శాతం వివరాలు :
అక్బర్ పేట భూంపల్లి : 87.63
బెజ్జంకి - 85.89
చిన్నకోడూరు-87.99
దుబ్బాక- 86.౯౧
మిరుదొడ్డి - 87.70
నంగునూరు -90.16
నారాయణరావు పేట - 89.78
సిద్దిపేట రూరల్ - 89.52
సిద్దిపేట అర్బన్ - 89.30
తొగుట - 89.74






