84 గ్రామాల్లో కాంగ్రెస్ మద్దతు దారులే సర్పంచ్ లు కావాలి : జ‌గ్గారెడ్డి

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, సంగారెడ్డి బ్యూరో : సంగారెడ్డి నియోజవర్గంలోని సంగారెడ్డి, కొండాపూర్, కంది, సదాశివపేట మండలాల పరిధిని 84 గ్రామాల్లో సర్పంచ్ లు కాంగ్రెస్ పార్టీ మద్దతు దారులే గెలవాలి. ఆయా గ్రామాల్లోని

84 గ్రామాల్లో కాంగ్రెస్ మద్దతు దారులే సర్పంచ్ లు కావాలి : జ‌గ్గారెడ్డి
X

దిశ‌, సంగారెడ్డి బ్యూరో : సంగారెడ్డి నియోజవర్గంలోని సంగారెడ్డి, కొండాపూర్, కంది, సదాశివపేట మండలాల పరిధిని 84 గ్రామాల్లో సర్పంచ్ లు కాంగ్రెస్ పార్టీ మద్దతు దారులే గెలవాలి. ఆయా గ్రామాల్లోని ముఖ్యమైన నాయకులు చాలెంజ్ గా తీసుకుని 84 మంది సర్పంచులు కాంగ్రెస్ కండువాలతో తన వద్దకు తీసుకు రావాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. అలా గెలిచి తన వద్దకు వచ్చిన వారిని సీఎం రేవంత్ రెడ్డితో కల్పించి గ్రామాల అభివృద్ధికి నిధులు ఇప్పించే బాధ్యత తనదని జగ్గారెడ్డి అభయం ఇచ్చారు. సంగారెడ్డి జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో టీజీ ఐఐసీ చైర్ పర్సన్ నిర్మలతో కలిసి ఆయన సర్పంచ్ ఎన్నికలపై దిశా నిర్దేశం చేశారు. మనం అధికారంలో లేనప్పుడు, కష్ట కాలంలో ఎవరైతే కాంగ్రెస్ కండువా కప్పుకుని తిరిగారో, డబ్బులు లేకున్నా వారినే సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టి గెలిపించుకుని రావాలని సూచించారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత పార్టీలోకి వచ్చిన వారిని సర్పంచ్ అభ్యర్థిగా ఎంపిక చేయవద్దన్నారు. ఎస్సీ,ఎస్టీ, బీసీ రిజర్వేషన్ లు ఉన్న గ్రామాల్లో డబ్బులు లేని కష్టపడే కార్యకర్తలు ఉంటే వారినే ఎంపిక చేయాలని ఆయా గ్రామాల నాయకులకు సూచించారు. ఆ గ్రామంలో ఉన్న ముఖ్యనాయకు, కార్యకర్తలు అలాంటి వారికి ఆర్థికంగా సహకరించి గెలిపించాలని కోరారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ , మల్లిఖార్జున ఖర్గే నాయకత్వంలో సీఎం రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న పథకాలు , మహిళలకు ఉచిత బస్సు, ఐదువందల కే గ్యాస్, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, రెండు లక్షల రుణ మాఫీ, వరికి రూ.500 బోనస్, రేషన్ కార్డులు, 200 యూనిట్ల ఉచిత కరెంట్ వంటి పథకాలు చెప్పి ప్రజలను ఓట్లు అడగాలన్నారు.

మన పార్టీ వారే ఓటమికి ప్రయత్నిస్తే సహించం

మన కాంగ్రెస్ పార్టీలోని ఉంటూ కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి ఓటమికి ప్రయత్నం చేసే వారిని సహించబోమని జగ్గారెడ్డి హెచ్చరించారు. పార్టీలో వారు ఎంతటి వారైనా తను క్షమించనన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖా మంత్రి శ్రీధర్ బాబు, టీజిఐఐసీ చైర్ పర్సన్ నిర్మల సహకారంతో సంగారెడ్డి నియోజకవర్గంలో పరిశ్రమల స్థాపనకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. పరిశ్రమల స్థాపన కోసం రైతులు స్వచ్ఛందంగా ముందుకు వస్తేనే భూములు తీసుకుంటున్నాం జగ్గారెడ్డి పునరుద్ఘాటించారు. పరిశ్రమలు ప్రారంభమైతే ఈ ప్రాంత యువతకు ఉపాధి, ఉద్యోగాలు దొరుకుతాయని చెప్పారు. టీజిఐఐసీ చైర్ పర్సన్ గా నిర్మల సంగారెడ్డి , పఠాన్ చెరు నియోజకవర్గాల్లో పరిశ్రమల స్థాపన కోసం పనులన్నీ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారని వెల్లడించారు.

ఎమ్మెల్యే గా నిర్మలనే పోటీ చేస్తారు

వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా నిర్మలనే బరిలో ఉంటారని నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలకు, నాయకులు గుర్తుంచుకోవాలని జగ్గారెడ్డి మరో సారి గుర్తు చేశారు. రానున్న మూడేళ్ల తర్వాత వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే గా నిర్మలనే పోటీ చేసారని, రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ లు ముగ్గురు కలిసి చెప్పినా నిర్మలనే కాంగ్రెస్ క్యాండిడేట్ గా ఉంటదని పేర్కొన్నారు. నేను పోటీ చేస్తానని అనుకోకండి, నిర్మలనే అనుసరించాలని సూచనలు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో తాను ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు సీఎంలు రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిల సహకారంతో ఐఐటి, సంగారెడ్డి- పఠాన్ చేరు ఫోర్ వే రోడ్ లైన్, ఆకొలా నాందేడ్ రోడ్, సంగారెడ్డికి మంజీరా నీళ్ళు, అగ్రికల్చర్ యూనివర్సిటీతో తీసుకురావడంతో పాటు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు గతాన్ని గుర్తు చేశారు. తనను ఎన్నికల్లో ఓడగొట్టినా, సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి సంగారెడ్డికి నిధులు తీసుకు వస్తూనే ఉన్నానని, ఈ విషయం నియోజకవర్గ ప్రజలకు చెప్పాలని నాయకులకు సూచించారు.

ఎన్నికల కమిటీల సభ్యులు

నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నాయకులను గ్రామ పంచాయతీల ఎన్నికల పర్యవేక్షణ కమిటీ సభ్యులుగా జగ్గారెడ్డి నియమించారు. చేర్యాల ఆంజనేయులు, నిర్మల, తోపాజి అనంత్ కిషన్, రామ్ రెడ్డి, తొగర్పల్లి ప్రభు, చిద్రుప్ప రఘు గౌడ్ లు సభ్యులుగా ఉన్నారు. ఎన్నికల విషయంలో ఎలాంటి పనులున్నా ఈ ఆరుగురిని సంప్రదించాలని జగ్గారెడ్డి సూచించారు. నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు వాళ్ళ పరిధిలోని గ్రామాలను పర్యవేక్షించాలన్నారు.

Next Story