గంజాయి స్మగ్లర్లకు 20 ఏళ్ల జైలు శిక్ష‌

by Nallavelli.Anjaneyulu |

గంజాయి స్మ‌గ్ల‌ర్ల‌కు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది సంగారెడ్డి కోర్టు. జిల్లా మొద‌టి అద‌న‌పు జిల్లా, సెష‌న్స్ న్యాయ‌మూర్తి జ‌యంతి తీర్పు వెల్ల‌డించింది.

గంజాయి స్మగ్లర్లకు 20 ఏళ్ల జైలు శిక్ష‌
X

దిశ, ఝరాసంగం : గంజాయి స్మ‌గ్ల‌ర్ల‌కు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది సంగారెడ్డి కోర్టు. జిల్లా మొద‌టి అద‌న‌పు జిల్లా, సెష‌న్స్ న్యాయ‌మూర్తి జ‌యంతి తీర్పు వెల్ల‌డించింది. నిందితుల‌కు 20 ఏళ్ల క‌ఠిన కారాగార శిక్ష‌తో పాటు రూ.2ల‌క్ష‌లు జ‌రిమానా విధించారు. జ‌రిమానా చెల్లించ‌ని పక్షంలో మరో రెండేళ్ల కఠిన కారాగార శిక్ష అనుభవించాలని ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం చిలపల్లి తండాకు చెందిన జాదవ్ బన్సీలాల్, రాథోడ్ శంకర్‌లు 2020లో గంజాయి అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డారు. ఆందోల్ పరిధిలో ఎన్‌ఫోర్స్‌మెంట్ మెదక్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో ఏపీ 10 డబ్ల్యూ 2212 నంబర్ గల వాహనంలో తరలిస్తున్న 850 కిలోల పొడి గంజాయిని స్వాధీనం చేసుకుని, నిందితులను అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై నిషేధ & ఎక్సైజ్ శాఖ అధికారులు కేసు నమోదు చేశారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్ సుబ్రహ్మణ్యం కేసును దర్యాప్తు చేసి చార్జ్ షీట్ దాఖలు చేశారు. కోర్టులో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజేశ్వర్ సాక్ష్యాధారాలతో వాదనలు వినిపించగా, అభియోగాలు రుజువుకావడంతో కోర్టు నిందితులకు కఠిన శిక్ష విధించింది. సంబంధిత అధికారుల సమన్వయం, పకడ్బందీ దర్యాప్తుతో కేసు విజయవంతమైందని ఉన్నత అధికారులు ప్రశంసించారు.

Next Story