- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అంతా మా ఇష్టం.. పనులు చేయకుండానే 15వ ఆర్థిక సంఘం డబ్బు డ్రా
ఆలు లేదు, చూలు లేదు అల్లుడి పేరు సోమలింగం అన్నట్లుగా ఉంది ఈ వ్యవహారం.

దిశ, సంగారెడ్డి: ఆలు లేదు, చూలు లేదు అల్లుడి పేరు సోమలింగం అన్నట్లుగా ఉంది ఈ వ్యవహారం. మార్చి నెలతో ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. పంచాయతీ ఖాతాలో మిగులుగా ఉన్న నిధులు తిరిగి వెళ్లిపోతాయనే కారణంతో ఓ గ్రామ పంచాయతీలో అక్కడ పనిచేసే సిబ్బంది నిధులను దుర్వినియోగం చేశారు. అసలు ఎలాంటి పనులు చేపట్టకుండానే లక్షల రూపాయల డబ్బును తమ వ్యక్తిగత అకౌంట్లోకి వేసుకున్నారు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మునిదేవునిపల్లి గ్రామపంచాయతీలో జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
బాండ్ పేపర్ ద్వారా పనులు చేయిస్తామని హామీ..
అసలు గ్రామ పంచాయతీకి సంబంధించిన నిధులను ముందస్తుగా తీసుకోవడమే తప్పు అయితే విచిత్రంగా చేసిన తప్పును కప్పిపుచ్చునుకునేందుకు పంచాయతీ కార్యదర్శితోపాటు సర్పంచులు ఉపసర్పంచ్ అందరూ బాండ్ పేపర్లో పనులు చేయిస్తామని హామీ ఇవ్వడం విడ్డూరంగా మారింది. చేసిన నేరాన్ని పక్క దోవ పట్టించే ప్రయత్నం తప్ప మరొకటి కాదంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదే విషయమై స్థానిక డీఎల్పీఓ అనితను దిశ వివరణ కోరగా, ఈ వ్యవహారానికి సంబంధించిన రిపోర్టును జిల్లా పంచాయతీ అధికారికి సమర్పించానని, వారినే వివరాలను అడిగి తెలుసుకోవాలని ఆమె నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా నూతన పంచాయతీ అధికారి ఈ వ్యవహారంపై కఠినంగా స్పందించి తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
వ్యక్తిగత అకౌంట్లోకి డబ్బు బదిలీ..
మునిదేవునిపల్లి గ్రామపంచాయతీ పరిధిలో పీర్లబావి ఉంది. ఈ బావిని మరమ్మతు చేయిస్తామంటూ, అందుకోసం నిధులు అవసరం ఉన్నాయని తీర్మానించుకొని ఎలాంటి అనుమతులు లేకుండానే గ్రామపంచాయతీ సెక్రెటరీ, సర్పంచ్ ఇతర సిబ్బంది సహకారంతో 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి రూ.7లక్షలను వారి వారి వ్యక్తిగత అకౌంట్లోకి బదిలీ చేయించుకున్నారు. ఈ తతంగమంతా స్థానిక పంచాయతీ కార్యదర్శి కిషోర్ దగ్గరుండి ఈ వ్యవహారం నడిపించినట్లు తెలిసింది. ఇదేంటని స్థానిక గ్రామస్తులు వారిని ప్రశ్నించగా కనీసం స్పందించడం లేదంటూ గ్రామస్తులు మండిపడ్డారు.
కలెక్టరేట్లో గ్రామస్తుల ఫిర్యాదు..
గ్రామపంచాయతీ నిధులను దుర్వినియోగం చేస్తున్నారంటూ మునిదేవునిపల్లి గ్రామానికి చెందిన కొందరు గ్రామస్తులు కొద్ది రోజుల క్రితం సంగారెడ్డి కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ముందస్తు అనుమతులు లేకుండానే 15వ ఆర్థిక సంఘం నిధులనుంచి రూ.7లక్షలను దుర్వినియోగం చేశారని పంచాయతీ కార్యదర్శి కిషోర్, సర్పంచ్ కృష్ణ, ఉప సర్పంచ్ వరలక్ష్మిలపై చర్యలు తీసుకోవాలని వారు తమ వినతిపత్రంలో అధికారులకు డిమాండ్ చేశారు.






