108 సిబ్బంది ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలి

by Taduka Kalyani |

రోగులకు మెరుగైన అత్యవసర సేవలను అందించడానికి 108 సిబ్బంది ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని ఉమ్మడి మెదక్ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ బోయిని సంపత్ సూచించారు.

108 సిబ్బంది ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలి
X

దిశ, గజ్వేల్ : రోగులకు మెరుగైన అత్యవసర సేవలను అందించడానికి 108 సిబ్బంది ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని ఉమ్మడి మెదక్ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ బోయిని సంపత్ సూచించారు. మంగళవారం గజ్వేల్ లోని 108, 102, 1962 అత్యవసర సేవల అంబులెన్సులను సిద్దిపేట జిల్లా మేనేజర్ మెరుగు నరేష్ యాదవ్ తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అంబులెన్సుల్లో ఉన్న మెడికల్ ఎక్విప్మెంట్లు, మెడికల్ ఇండెంట్, రికార్డులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. మండల ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో సత్వర సేవలు అందేలా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, వర్షాకాలంలో ప్రబలే సీజనల్ వ్యాధుల నేపథ్యంలో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సిబ్బందికి తెలిపారు. అత్యవసర సేవల్లో ఎలాంటి లోటు పాట్లు లేకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. సేవల నిర్వహణలో ఏవైనా నిర్లక్ష్యాలు లేదా లోపాలు తలెత్తితే బాధ్యులపై తగినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో అంబులెన్సు సబ్బంది చక్రపాణి గౌడ్, కొండల్ రెడ్డి, పర్శరాములు, శ్రీనివాస్, రమేష్, రాజశేఖర్, వర్షిత, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.

Next Story