- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG: మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్‌కు జైలు శిక్ష
by Gantepaka Srikanth |
కోర్టు ధిక్కరణ కేసులో మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్‌కు రాష్ట్ర హైకోర్టు ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.2,000 జరిమానా విధించింది.

X
దిశ, తెలంగాణ బ్యూరో: కోర్టు ధిక్కరణ కేసులో మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్‌కు రాష్ట్ర హైకోర్టు ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.2,000 జరిమానా విధించింది. భూ వివాదం కేసులో గతంలో కోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారని(కోర్టు ధిక్కరణ) ధర్మాసనం ఆదేశాలలో పేర్కొంది. కలెక్టర్ కోర్టు ఆదేశాలను పట్టించుకోలేదని ఆరోపిస్తూ మెదక్ జిల్లా బోనాల్ గ్రామానికి చెందిన లక్ష్మి అనే మహిళ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం తీర్పు వెలువరించింది. తీర్పుపై అప్పీలు చేసుకునేందుకు కలెక్టర్‌కు కోర్టు నాలుగు వారాల గడువు ఇచ్చింది. అంతవరకు శిక్ష అమలును తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Next Story






