- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Medak: పేకాట శిభిరంపై దాడి.. 11 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ముందస్తు సమాచారంతో పేకాట శిభిరంపై దాడి చేసిన పోలీసులు 11 మందిని అరెస్ట్ చేశారు.

దిశ, వెబ్ డెస్క్: ముందస్తు సమాచారంతో పేకాట శిభిరంపై దాడి చేసిన పోలీసులు 11 మందిని అరెస్ట్ చేశారు. ఈ దాడిలో భారీగా నగదు పట్టుబడింది. మెదక్ జిల్లా(Medak District) ఏడుపాయల దేవస్థానం(Edu Payala Temple) పరిధిలో గెస్ట్‌హౌజ్(Guest House) లో పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో రంగంలోకి దిగిన హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ సిబ్బంది(Hyderabad Task Force Police) గెస్ట్ హౌజ్ పై దాడి చేశారు. పేకాట ఆడుతున్న 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరంతా హైదరాబాద్(Hyderabad), మెదక్(Medak) జిల్లాలకు చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు. ఈ దాడిలో రూ. 12 లక్షల నగదుతో పాటు కార్లు, సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో పలువురు గుర్తింపు పొందిన పొలిటికల్ లీడర్లు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కాసేపట్లో కొల్చారం పోలీస్ స్టేషన్ లో జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి, వివరాలు వెల్లడించనున్నారని తెలిసింది.






