- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
OU: ఎంఈడీ, ఎంపీఈడీ అడ్మిషన్ల షెడ్యూల్ విడుదల..
by Ramesh Naini |
రాష్ట్రంలోని ఎంఈడీ, ఎంపీఈడీ కోర్సుల ప్రవేశాలకు సంబంధించిన మొదటి దశ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల అయింది.

X
టదిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ఎంఈడీ, ఎంపీఈడీ కోర్సుల ప్రవేశాలకు సంబంధించిన మొదటి దశ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల అయింది. గురువారం ఉస్మానియా యూనివర్శిటీ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి కౌన్సెలింగ్ షెడ్యూల్ రిలీజ్ చేశారు. అర్హత కలిగిన అభ్యర్థులు నవంబర్ 8 నుంచి 11 వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.
అభ్యర్థుల ధ్రువీకరణ వివరాల్లో సవరణలకు నవంబర్ 12న అవకాశం కల్పించారు. అదే తేదీతోపాటు 13న వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని చెప్పారు. నవంబర్ 16న మొదటి దశ సీట్ల కేటాయింపు జరగనుందని, విద్యార్థులు నవంబర్ 18లోగా కేటాయించిన కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు అభ్యర్థులు ఉస్మానియా యూనివర్శిటీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని కన్వీనర్ సూచించారు.
Next Story






