Thummala: పత్తి రైతులకు మద్దతు ధర దక్కేలా చర్యలు తీసుకుంటాం: మంత్రి తుమ్మల

by Prasad Jukanti |

త్తి కొనుగోలుపై రేపు మరోసారి మంత్రి తుమ్మల చర్చలు జరపనున్నారు.

Thummala: పత్తి రైతులకు మద్దతు ధర దక్కేలా చర్యలు తీసుకుంటాం: మంత్రి తుమ్మల
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: పత్తి రైతులకు (cotton farmers) మద్దతు ధర దక్కేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) అన్నారు. పత్తి కొనుగోలుపై రేపు మరోసారి మంత్రి తుమ్మల చర్చలు జరపనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు సచివాలయంలో సీసీఐ (CCI) ఎండీ, జిన్నింగ్ మిల్లర్లతో సమావేశం కానున్నారు. సీసీఐ పత్తి కొనుగోళ్లపై రేపటి సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కొనుగోలు సీజన్ మొదలైన రాష్ట్రంలో సీసీఐ పత్తి కొనుగోలు మొదలుపెట్టలేదు. పత్తి కొనుగోళ్లలో జిన్నింగ్ మిల్లులు టెండర్లలో పాల్గొనకపోవడంతో ఈ సమస్య ఉత్పన్నమైంది. ఈ నేపథ్యంలో ఈ సమస్యలను పరిష్కరించేందుకు రేపు సీసీఐ, జిన్నింగ్ మిల్లులతో మంత్రి చర్చలు జరపనున్నారు.

Next Story