- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్టీసీ కార్మికుల సమస్యలన్నీ పరిష్కరిస్తాం: MD నాగిరెడ్డి
ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు టీజీఎస్ఆర్టీసీ కార్మికుల సమస్యలన్నింటినీ దశవారీగా పరిష్కరిస్తామని ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డి తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు టీజీఎస్ఆర్టీసీ కార్మికుల సమస్యలన్నింటినీ దశవారీగా పరిష్కరిస్తామని ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డి తెలిపారు. ఇటీవల సమ్మె ముగిసి ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు అన్నింటినీ ప్రభుత్వం అమలు చేసేందుకు అంగీకరించిన నేపథ్యంలో ఆర్టీసీ జేఏసీ సోమవారం ఎండీ నాగిరెడ్డిని బస్ భవన్ లో ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా ఎండీకి కార్మికులు ధన్యవాదాలు తెలిపారు. గుర్తింపు సంఘ ఎన్నికలు నిర్వహించడానికి యాజమాన్యం, ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ వెంటనే తగు చర్యలు తీసుకోవాలని జేఏసీ నేతలు కోరారు. దీనికి ఎండీ సానుకూలంగా స్పందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
జేఏసీ తలపెట్టిన సమ్మె విజయవంతం అవ్వడంలో ఎండీ పోషించిన పాత్రపైనా జేఏసీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో విలీనం, గుర్తింపు సంఘ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్, 11 శాతం ఫిట్మెంట్ తో వేతన సవరణ ఏప్రిల్ 2021 నుంచి అమలు చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు యాజమాన్యానికి జారీ చేసినందున ఎండీకి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో జేఏసీ ఛైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ ఛైర్మన్ ఎం.థామస్ రెడ్డి, కన్వీనర్ ఎండి మౌలానా, కో కన్వీనర్లు కత్తుల యాదయ్య, సుద్దాల సురేష్, బి.యాదగిరిలు తదితరులున్నారు. మూడు ప్రధాన డిమాండ్లతో పాటు మిగతా 29 డిమాండ్లను యాజమాన్యంతో పరిష్కారం చేసుకోమని ప్రభుత్వం ఆదేశించినందున యాజమాన్యం వెంటనే ఆ డిమాండ్ల పరిష్కారానికి తగిన చర్యలు ప్రారంభించాలని జేఏసీ ఛైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ ఛైర్మన్ ఎం.థామస్ రెడ్డి కోరారు.






