- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రతి పనిలో విజయం సిద్ధించాలి.. వినాయక చవితి విషెస్ చెప్పిన MLC కవిత
తెలంగాణ (Telangana) వ్యాప్తంగా వినాయక చవితి (Vinayaka Chavithi) నవరాత్రోత్సవాలకు రంగం సిద్ధమైంది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ (Telangana) వ్యాప్తంగా వినాయక చవితి (Vinayaka Chavithi) నవరాత్రోత్సవాలకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే నిర్వాహకులు మండపాలు ఏర్పాటు చేసి గణేష్ విగ్రహాలను తరలిస్తున్నారు. మహిళలు, పురుషులు, చిన్నారులు అనే తేడా లేకుండా అంతా ఐకమత్యంతో పండుగను జరుపుకుంటున్నారు. ఇక ప్రధాన ఆలయాల ఎదుట భక్తులు క్యూ కట్టారు. తమ ఇష్ట దైవాలను దర్శించుకునేందుకు తెల్లవారుజామునే కోవెలకు చేరుకుని.. తన కోరికలు తీర్చాలంటూ ఆ భవగవంతుడి ప్రార్థిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ (ట్విట్టర్) వేదికగా ప్రజలకు వినాయక చవితి సందర్భంగా స్పెషల్ విషెస్ చెబుతూ ట్వీట్ చేశారు. గణనాథుడి ఆశీస్సులతో మీ ప్రతి పనిలో విజయం సిద్ధించాలని.. విఘ్నాధిపతి మీకు సుఖ సంతోషాలను ప్రసాదించాలని కోరుకుంటూ.. వినాయక చవితి శుభాకాంక్షలు! అంటూ కవిత ట్వీట్ చేశారు.






