రాష్ట్రంలో భారీగా IAS, IPSల బదిలీలు.. హైదరాబాద్ సీపీగా సజ్జనార్

by Kema Shiva Kumar |   (  Updated:2025-09-27 03:58:42  IST  )

రాష్ట్రంలో పాలనాపరమైన, శాంతిభద్రతలకు సంబంధించి తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రంలో భారీగా IAS, IPSల బదిలీలు.. హైదరాబాద్ సీపీగా సజ్జనార్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో పాలనాపరమైన వ్యవహారాలు, శాంతిభద్రతలకు సంబంధించి తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆరుగురు ఐఏఎస్ అధికారులు, 23 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేశారు. ఈ మేరకు ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌‌గా ఇప్పటి వరకు ఆర్టీసీ ఎండీగా ఉన్న సజ్జనార్ నియమితులయ్యారు. అదేవిధంగా ఇంటెలిజెన్స్ చీఫ్‌గా విజయ్ కుమార్, హోంశాఖ సెక్రటరీగా సీవీ ఆనంద్, సెంటర్‌ ఫర్‌ గుడ్‌గవర్నెన్స్‌ డీజీగా రవిగుప్తా, ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌గా రఘునందన్ రావు, వ్యవసాయ శాఖ కార్యదర్శిగా సురేంద్ర మోహన్‌, జీఏడీ పొలిటికల్ సెక్రటరీగా రిజ్వీకి బాధ్యతలు కట్టబెట్టారు.

ఇక రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌గా హరిత, స్పెషల్ సెక్రటరీగా సందీప్ కుమార్ ఝా, విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీ, సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్‌గా శిఖా గోయల్, ఏసీబీ డీజీగా చారుసిన్హాకు అదునపు బాధ్యతలు ఇచ్చారు. అదేవిధంగా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డీజీగా స్వాతి లక్రాకు అడిషనల్ చార్జ్ కట్టబెట్టారు. మల్డీజోన్-2 ఐజీగా డీఎస్ చౌహాన్, గ్రేహౌండ్స్ ఏడీజీగా అనిల్ కుమార్, పౌర సరఫరాల శాఖ కమిషనర్‌గా స్టీఫెన్ రవీంద్ర, ఆర్టీసీ ఎండీగా నాగిరెడ్డి, ఫైర్ డీజీగా విక్రమ్ సింగ్‌లను నియమించారు. హైదరాబాద్ క్రైమ్ అడిషనల్ సీపీగా శ్రీనివాసులు, హైదరాబాద్ అడిషనల్ శాంతిభద్రతలను సీపీగా తసఫీర్ ఇక్బాల్, వెస్ట్ జోన్ డీసీపీగా సీహెచ్ శ్రీనివాస్, సిద్దిపేట సీపీగా విజయ్ కుమార్, నారాయణ పేట్ ఎస్పీగా వినీత్‌‌ బదిలీ అయ్యారు. ఏసీబీ జాయింట్ డైరెక్టర్‌గా సింధు శర్మ, రాజేంద్ర నగర్ డీసీపీగా యోగేష్ గౌతమ్, మాదాపూర్ డీసీసీగా రీతిరాజ్, ఎస్బీ నగర్ డీసీపీగా అనురాధ ట్రాన్స్‌ఫర్ అయ్యారు.

Next Story