ఎక్సైజ్ శాఖలో భారీగా బదిలీలు

by Ajay Maddhiboyina |

రాష్ట్రంలోని ఎక్సైజ్ శాఖలో పని చేస్తున్న 68 మంది అధికారులను బదిలీ చేస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్లు, సూపరిండెంట్లుగా పనిచేస్తున్న అధికారులను బదిలీ చేస్తూ, మరికొందరికి కొత్తగా పోస్టింగులు ఇస్తూ ప్రభుత్వ కార్యదర్శి రఘనందన్‌ రావు ఉత్తర్వులు జారీ చేశారు.

ఎక్సైజ్ శాఖలో భారీగా బదిలీలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని ఎక్సైజ్ శాఖలో పని చేస్తున్న 68 మంది అధికారులను బదిలీ చేస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్లు, సూపరిండెంట్లుగా పనిచేస్తున్న అధికారులను బదిలీ చేస్తూ, మరికొందరికి కొత్తగా పోస్టింగులు ఇస్తూ ప్రభుత్వ కార్యదర్శి రఘనందన్‌ రావు ఉత్తర్వులు జారీ చేశారు. మెదక్ డిప్యూటీ కమిషనర్‌గా పనిచేస్తున్న జే.హరికిషన్‌ను సైబరాబాద్ డీసీగా, నల్గొండ డిప్యూటీ కమిషనర్‌గా పని చేస్తున్న ఏ.శ్రీనివాస్ రెడ్డిని గ్రేటర్ హైదరాబాద్ డీసీగా, రంగారెడ్డి డిప్యూటీ కమిషనర్‌గా పని చేస్తున్న పీ.ధశరథను టీజీబీసీఎల్ డీసీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఖమ్మం డిప్యూటీ కమిషనర్ జీ.జనార్ధన్ రెడ్డిని ఆదిలాబాద్‌‌కు బదిలీ చేసింది.

హెచ్.దత్తురాజ్ గౌడ్‌ను టీజీబీసీఎల్ ఆర్ఆర్-1 నుంచి ట్రాన్స్‌ఫర్ చేసి వరంగల్ డిప్యూటీ కమిషనర్‌గా ప్రభుత్వం నియమించింది. నిజామాబాద్ అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేస్తున్న వీ.సోమిరెడ్డిని ఖమ్మం డిప్యూటీ కమిషనర్‌గా, టీజీబీసీఎల్ కరీంనగర్ మేనేజర్ జే.రవికుమార్‌ను కరీంనగర్ డిప్యూటీ కమిషనర్‌గా నియమించింది. లేబుల్ అసిస్టెంట్ కమిషనర్ పీ.శ్రీధర్‌ను నిజామాబాద్ డిప్యూటీ కమిషనర్‌గా, హెడ్‌క్వార్టర్స్ డిప్యూటీ కమిషనర్‌గా పని చేస్తున్న కే.రఘురామ్‌ను రంగారెడ్డి డీసీగా ప్రభుత్వం నియమించింది.

హైదరాబాద్ అసిస్టెంట్ కమిషనర్ ఏ.అనిల్ కుమార్ రెడ్డిని ఈస్ట్ జాయింట్ డెరెక్టర్‌గా, ఎస్టీఎఫ్ అసిస్టెంట్ కమిషనర్ పీ.ప్రణవీని మల్కాజిగిరి డిప్యూటీ కమిషనర్‌గా, మహబూబ్‌నగర్ అసిస్టెంట్ కమిషనర్‌గా పని చేస్తున్న ఏ.విజయ్‌భాస్కర్ రెడ్డిని అదే జిల్లాకు డిప్యూటీ కమిషనర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బ్రేవరీస్ అసిస్టెంట్ కమిషనర్ ఏ.చంద్రయ్యను మెదక్ డిప్యూటీ కమిషనర్‌గా, ఈస్ట్ జాయింట్ డైరెక్టర్ సీవీ శశిధర్ రెడ్డిని నల్గొండ డిప్యూటీ కమిషనర్‌గా నియమిస్తూ.. ప్రభుత్వ కార్యదర్శి రఘనందన్‌ రావు ఉత్తర్వులు జారీ చేశారు. వీరినే కాకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న అసిస్టెంట్ కమిషనర్ కేడర్ అధికారులు 19 మందిని, సూపరిండెంట్ కేడర్‌లో విధులు నిర్వర్తిస్తున్న 35 మంది ఆఫీసర్లను కూడా ట్రాన్స్‌ఫర్ చేస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Next Story