TG: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ

by Gantepaka Srikanth |

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ మార్పులు చేపట్టారు. పాలనలో వేగం పెంచే లక్ష్యంతో శనివారం రాత్రి 13 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

TG: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ మార్పులు చేపట్టారు. పాలనలో వేగం పెంచే లక్ష్యంతో శనివారం రాత్రి 13 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో కీలక శాఖల సెక్రటరీలతో పాటు జిల్లా కలెక్టర్లు కూడా ఉన్నారు. రాష్ట్రంలోని ముఖ్యమైన విభాగాలకు కొత్త అధికారులను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా పంచాయతీ రాజ్, ఆరోగ్య శాఖ వంటి కీలక రంగాల్లో మార్పులు జరిగాయి.

దాన కిషోర్: పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టనున్నారు.

హనుమంతు: ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈవోగా నియామకం.

దాసరి హరిచందన: కార్మిక శాఖ సెక్రటరీగా నియమాకం.

కృష్ణ ఆదిత్య: పరిశ్రమల శాఖ బాధ్యతలు అప్పగింత.

కలెక్టర్ల మార్పు

హైదరాబాద్‌తో సహా పలు జిల్లాలకు కొత్త కలెక్టర్లను కేటాయించారు.

హైదరాబాద్ కలెక్టర్: ప్రియాంక అల.

సంగారెడ్డి కలెక్టర్: ప్రతీక్ జైన్.

నిర్మల్ కలెక్టర్: భవేష్ మిశ్రా.

ఇతర ముఖ్య బదిలీలు:

ఢిల్లీ తెలంగాణ భవన్ స్పెషల్ ఆఫీసర్: సంజయ్ కుమార్.

ఆర్ అండ్ బీ స్పెషల్ సెక్రటరీ: ప్రావీణ్య.

ట్రైబల్ వేల్ఫేర్ స్పెషల్ సెక్రటరీ: సంతోష్.

ఇంటర్ బోర్డు సెక్రటరీ: అభిలాష్ అభినవ్.

సాంఘిక సంక్షేమ శాఖ సెక్రటరీ: విజయేంద్ర.

టీజీఎండీసీ ఎండీ: అనుదీప్ దుర్శెట్టి.

రాష్ట్రంలో పాలనను మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు, సీనియర్ అధికారుల అనుభవాన్ని వినియోగించుకోవాలనే ఉద్దేశంతోనే ఈ బదిలీలు జరిగినట్లు సచివాలయ వర్గాలు వెల్లడించాయి.

Next Story