Karnataka: నిన్న బీదర్ నేడు మంగళూరు.. కర్ణాటక బ్యాంకులో భారీ చోరీ

by Prasad Jukanti |

కర్ణాటకను వరుస చోరీలు హడలెత్తిస్తున్నాయి.

Karnataka: నిన్న బీదర్ నేడు మంగళూరు.. కర్ణాటక బ్యాంకులో భారీ చోరీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: కర్ణాటక (Karnataka) లో వరుస దొంగతనాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. నిన్న బీదర్ లో పట్టపగలు ఏటీఎం సిబ్బందిపై కాల్పులు జరిపి రూ. 93 లక్షలు దోచుకుని వెళ్లిన ఘటన నుంచి తేరుకోకముందే తాజాగా మంగళూరులో (Mangalore)లోని మరో భారీ చోరీ జరిగింది. శుక్రవారం మంగళూరులోని కొటేకర్ కో ఆపరేటివ్ బ్యాంక్ లో భారీ చోరీకి పాల్పడ్డారు. బ్యాంక్ లోకి చొరబడి దోచుకెళ్లిన ఐదుగురు దొంగల ముఠా రూ. 15 కోట్ల విలువైన బంగారం, రూ. 5 లక్షల క్యాష్ చోరీ చేశారు. కర్ణాటకలో జరుగుతున్న వరుస ఘటనలు సామాన్యులతో పాటు అధికారులను కలవరపాటుకు గురి చేస్తున్నాయి.

Next Story