- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అవసరాలను బట్టి రాజకీయాలు మారుతుంటాయి: మహేష్ కుమార్ గౌడ్
అవసరాలు బట్టి రాజకీయాలు మారుతుంటాయి: మహేష్ కుమార్ గౌడ్

దిశ, వెబ్‌డెస్క్: ఓట్ చోరీకి వ్యతిరేకంగా హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో తెలంగాణ యువజన కాంగ్రెస్ మహా నిరసన కార్యక్రమం చేపట్టింది. ముఖ్య అతిథిగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud), మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు. బిహార్‌లో దొడ్డి దారిన ఎన్డీయే కూటమి విజయం సాధించిందని విమర్శించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఎన్నికలు జరగాలని అభిప్రాయపడ్డారు. యువజన కాంగ్రెస్ చేపట్టిన ఈ కార్యక్రమం ప్రజల్ని చైతన్య వంతం చేసే విధంగా ఉందని అన్నారు. ఓట్ చోరీపై ప్రజలను చైతన్యవంతం చేస్తూ రాహుల్ గాంధీ ఎనలేని పోరాటం చేస్తున్నారని కొనియాడారు. ఓట్ శాతం తక్కువగా వచ్చి ఎన్డీయే సీట్లు గెలవడం వెనక అనేక అనుమానాలు ఉన్నాయని అన్నారు.
బిహార్‌లో ఓట్ చోరీతో ఎన్డీయే కూటమికి సీట్లు వచ్చాయని ఆరోపించారు. ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా బిహార్‌లో ఎన్డీయే కూటమికి సీట్లు గెలుచుకుందని విమర్శించారు. ఓట్ చోరీతో దేశ భవిష్యత్ ప్రశ్నార్థకం అవుతోందని అన్నారు. ఎన్నికల సంఘం దీనిపై దృష్టి పెట్టకపోగా.. అనుకూలంగా వ్యవహరించడం దారుణమని మండిపడ్డారు. దేశం బాగుపడాలంటే ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవాల్సిన అవశ్యకత ఉందని అన్నారు. అధికారంలోకి రావడమే లక్ష్యంగా ప్రధాని మోడీ, అమిత్ షా ఎంతకైనా తెగిస్తున్నారని ఫైర్ అయ్యారు.
మరోవైపు.. మక్కాలో జరిగిన సంఘటన బాధాకరం.. అందులో హైదరాబాద్ వాళ్ళు ఉండడం మరింత బాధాకరం. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సచివాలయంలో హెల్ప్ లైన్ ఏర్పాటు చేసింది. చనిపోయిన 18 మంది కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. మేము కాంగ్రెస్‌తో ఉన్నామని.. ప్రభుత్వంతో కలిసి ఉన్నామని అసదుద్దీన్ చెప్పారు.. రాజకీయాల్లో పరిస్థితులు అవసరాలు బట్టి రాజకీయాలు మారుతుంటాయని అన్నారు.






