రాష్ట్రంలో భారీగా మావోయిస్టుల సరెండర్.. నేడు డీజీపీ ఎదుట హాజరు!

by Kema Shiva Kumar |

తెలంగాణలో మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇవాళ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట 30 మంది మావోయిస్టుల సరెండర్ కాబోతున్నారు.

రాష్ట్రంలో భారీగా మావోయిస్టుల సరెండర్.. నేడు డీజీపీ ఎదుట హాజరు!
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో మావోయిస్టు కార్యకలాపాలకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకోబోతోంది. రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి (DGP Shivadhar Reddy) సమక్షంలో ఇవాళ భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోనున్నారు. ఈ పరిణామం రాష్ట్ర భద్రతా వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. సుమారు 30 మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలో చేరేందుకు సిద్ధమయ్యారు. వీరంతా నేడు డీజీపీ కార్యాలయంలో పోలీసు ఉన్నతాధికారుల ఎదుట లొంగిపోనున్నారు. అయితే, ఈ సరెండర్లకు సంబంధించిన పూర్తి వివరాలను, లొంగిపోయిన వారి వివరాలను మధ్యాహ్నం 3 గంటలకు డీజీపీ శివధర్ రెడ్డి మీడియా సమావేశంలో అధికారికంగా వెల్లడించనున్నారు.

కాగా, లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పునరావాసం, నగదు పురస్కారాలు, ఇతర ప్రోత్సాహకాలను అందజేసే అవకాశం ఉంది. రాష్ట్రంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలీసుల నిఘా పెరగడం, ప్రభుత్వ పునరావాస పథకాలకు ఆకర్షితులై వీరు లొంగిపోతున్నట్లుగా తెలుస్తోంది.

Next Story