తెలంగాణలో మరో భారీ కుంభకోణం.. బయటపెట్టిన వాణిజ్య పన్నుల శాఖ

by Prasad Jukanti |   (  Updated:2026-03-13 13:04:12  IST  )

రాష్ట్రంలో రూ. 84.15 కోట్ల విలువైన జీఎస్టీ ఐటీసీ మోసాన్ని అధికారులు బయటపెట్టారు.

తెలంగాణలో మరో భారీ కుంభకోణం.. బయటపెట్టిన వాణిజ్య పన్నుల శాఖ
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో మరో భారీ కుంభకోణం వెలుగు చూసింది. దాదాపు రూ. 84.15 కోట్ల విలువైన జీఎస్టీ మోసాన్ని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ బయటపెట్టింది. నకిలీ ఇన్వాయిస్‍ల ద్వారా ఇన్ పుట్ ట్యాక్స్ క్రెడిట్ పొందినట్లు ప్రధాన నిందితుడు, ఎస్ కేజీ ట్రేడింగ్ కంపెనీ ప్రొప్రైటర్ సందీప్‍ను అధికారులు అరెస్టు చేశారు. సందీప్‍కు సంబంధం ఉన్న ఇతర సంస్థల్లోనూ అక్రమాలు జరిగాయని గుర్తించి వాటి రిజిస్ట్రేషన్‍ను రద్దు చేశారు. ప్రస్తుతం సందీప్‍ను జ్యుడిషియల్ రిమాండ్‍కు తరలించారు

Next Story