- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నల్లమల ఫారెస్ట్‌లో భారీ అగ్నిప్రమాదం.. స్పందించిన మంత్రి కొండా సురేఖ
by GSrikanth |
నాగర్‌కర్నూలు జిల్లాలోని నల్లమల అడవిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అమ్రాబాద్ మండలం దోమలపెంట రేంజ్ పరిధిలో మంటలు చెలరేగాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: నాగర్‌కర్నూలు జిల్లాలోని నల్లమల అడవిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అమ్రాబాద్ మండలం దోమలపెంట రేంజ్ పరిధిలో మంటలు చెలరేగాయి. కొల్లంపెంట, కొమ్మనపెంట, పల్లెబైలు, నక్కర్లపెంటకు ఈ మంటలు వ్యాపించాయి. దీంతో 50 హెక్టార్ల విస్తీర్ణంలో అటవి దగ్ధమైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. తాజాగా.. ఈ అనుకోని అగ్నిప్రమాదంపై ఫారెస్ట్ మినిస్టర్ కొండా సురేఖ స్పందించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలు, అదుపులోకి తీసుకొచ్చినట్లు అధికారులు మంత్రికి వివరించారు. ఈ నేపథ్యంలో అధికారులు మంత్రి పలు కీలక సూచనలు చేశారు. అడవుల్లో కార్చిచ్చు వ్యాపించకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. దీంతో నల్లమల అటవీ ప్రాంతంలో అడవి జంతువులకు ముప్పు వాటిల్లకుండా అటవీశాఖ అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
Next Story






