- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు మృతి
by Gantepaka Srikanth |
ఛత్తీస్‌గఢ్(Chhattisgarh)లోని బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో మంగళవారం ఉదయం నుండి పోలీసులకు, మావోయిస్టుల(Maoists)కు మధ్య భారీగా ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.

X
దిశ, భద్రాచలం: ఛత్తీస్‌గఢ్(Chhattisgarh)లోని బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో మంగళవారం ఉదయం నుండి పోలీసులకు, మావోయిస్టుల(Maoists)కు మధ్య భారీగా ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు. ఘటనా స్థలంలో మావోయిస్టుల మృతదేహాలతో పాటు భారీ స్థాయిలోపేలుడు పదార్థాలు, ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నారు. మృతిచెందిన వారిలో మావోయిస్ట్ అగ్రనేతలు ఉన్నట్లు తెలుస్తుంది. ఎదురు కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. మృతిచెందిన మావోయిస్టుల వివరాలు పోలీసులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఎదురుకాల్పులకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా తెలియరాలేదు.
Next Story






