- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీ, తెలంగాణలో భారీగా రేషన్ కార్డుల రద్దు: కేంద్రం ప్రకటన
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీగా రేషన్ కార్డులు రద్దు చేసినట్లు కేంద్ర స్పష్టం చేసింది.

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీగా రేషన్ కార్డులు రద్దు చేసినట్లు కేంద్ర స్పష్టం చేసింది. పార్లమెంట్ సమావేశాల్లో మంత్రి స్పందిస్తూ.. తెలంగాణ (TG) రాష్ట్రంలో గత పది నెలల కాలంలో ఏకంగా 1,40,947 రేషన్ కార్డులు రద్దయినట్లు కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో వెల్లడించారు. అనర్హులుగా గుర్తించడం, నకిలీ కార్డుల ఏరివేత, లబ్ధిదారులు వేరే ప్రాంతాలకు వలస వెళ్లడం, కార్డుదారుల మరణం వంటి కారణాల వల్ల ఈ కార్డులను రద్దు చేసినట్లు కేంద్రం స్పష్టం చేసింది. అయితే, e-KYC, ఆధార్ వెరిఫికేషన్ పూర్తి కాకపోవడం అనే కారణంతో ఒక్క రేషన్ కార్డును కూడా రద్దు చేయలేదని ప్రభుత్వం పేర్కొంది.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 56.60 లక్షల రేషన్ కార్డులు అమల్లో ఉన్నట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అదేవిధంగా, ఆంధ్రప్రదేశ్ (AP) రాష్ట్రంలో ఈ ఏడాది ఇప్పటివరకు 50,681 రేషన్ కార్డులు రద్దయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం మొత్తం 88.37 లక్షల రేషన్ కార్డులు వినియోగంలో ఉన్నట్లు కేంద్రం లోక్‌సభకు సమర్పించిన నివేదికలో పేర్కొంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్డుల ఏరివేత కార్యక్రమం పారదర్శకతను పెంచడం, సరైన లబ్ధిదారులకు మాత్రమే ప్రభుత్వ సాయం అందేలా చూడటం ప్రధాన లక్ష్యంగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.






