గ్లోబల్ సమ్మిట్ ముగింపు వేడుకల కోసం భారీ ఏర్పాట్లు.. యుఏఈ రికార్డు బ్రేక్ చేయనున్న తెలంగాణ

by Ajay Maddhiboyina |

తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ 8,9వ తేదీల్లో మహేశ్వరం మీర్ఖాన్ పేటలో తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా సమ్మిట్ కోసం ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే సమ్మిట్ ముగింపు వేడుకల్లో మూడు

గ్లోబల్ సమ్మిట్ ముగింపు వేడుకల కోసం భారీ ఏర్పాట్లు.. యుఏఈ  రికార్డు బ్రేక్ చేయనున్న తెలంగాణ
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ 8,9వ తేదీల్లో మహేశ్వరం మీర్ఖాన్ పేటలో తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా సమ్మిట్ కోసం ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే సమ్మిట్ ముగింపు వేడుకల్లో మూడు వేల డ్రోన్లతో విజువల్ వండర్ సృష్టించాల‌ని నిర్ణ‌యించింది. తెలంగాణ ఈజ్ రైజింగ్.. క‌మ్.. జాయిన్ ది రైజ్ అనే అక్ష‌రాల స‌మూహం వ‌చ్చేలా డ్రోన్ షో ఏర్పాటు చేయాల‌ని భావిస్తోంది.

తెలంగాణ ప్ర‌భుత్వం డ్రోన్ షో ద్వారా ఇప్ప‌టికే యూఏఈ పేరుతో ఉన్న గిన్నిస్ బుక్ రికార్డు సైతం బ్రేక్ చేయ‌నుంద‌ని స‌మాచారం. ఇక ఈ స‌మ్మిట్ కోసం భారీ బందోబ‌స్తును సైతం ప్ర‌భుత్వం ఏర్పాటు చేయ‌నుంది. సుమారు 2500 మంది పోలీసులు ఈ స‌మ్మిట్ బందోబ‌స్తులో పాల్గొన‌నున్నారు. ట్రాఫిక్ పోలీసుల‌తో పాటు గ్రేహౌండ్, ఇంటిలిజెన్స్, అక్టోప‌స్, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ పోలీసుల‌తో క‌ట్టుదిట్ట‌మైన భ‌త్ర‌త ఏర్పాటు చేయ‌నున్నారు. స‌మ్మిట్ లో అంత‌ర్జాతీయ పెట్టుబ‌డి సంస్థ‌ల‌ ప్ర‌తినిధులు, పారిశ్రామిక దిగ్గ‌జాలు ఇత‌ర ప్ర‌ముఖులు మొత్తం 600 మంది వ‌ర‌కు హాజ‌రుకానున్నారు.

Next Story