- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కార్పొరేట్ కాలేజీల్లో ‘ప్రాక్టికల్స్’ మాస్ కాపీయింగ్..! బోర్డు ముందు ఎస్ఎఫ్ఐ ధర్నా
తెలంగాణ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలలో ఫిబ్రవరి 3, 4 వ తేదీల్లో శ్రీ చైతన్య, నారాయణ, ఎస్ఆర్ కళాశాల, రెసోనెన్స్, ఎంఎస్ కళాశాల ఇతర ప్రైవేటు, కార్పొరేట్ జూనియర్ కళాశాలలు మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడి మాస్ కాపీయింగ్ చేశాయని ఎస్ఎఫ్ఐ ఆరోపించింది.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలలో ఫిబ్రవరి 3, 4 వ తేదీల్లో శ్రీ చైతన్య, నారాయణ, ఎస్ఆర్ కళాశాల, రెసోనెన్స్, ఎంఎస్ కళాశాల ఇతర ప్రైవేటు, కార్పొరేట్ జూనియర్ కళాశాలలు మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడి మాస్ కాపీయింగ్ చేశాయని ఎస్ఎఫ్ఐ తెలంగాణ ఆరోపించింది. ఆ కళాశాలలపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని, వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. మాస్ కాపీయింగ్ కు పాల్పడిన కళాశాలలపై చర్యలు తీసుకుని, బ్లాక్ లిస్టులో పెట్టాలని, వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఇంటర్ బోర్డు కార్యాలయాన్ని SFI ఆధ్వర్యంలో ముట్టడించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా SFI రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఎస్ రజినీకాంత్, టి. నాగరాజు మాట్లాడుతూ, కార్పొరేట్ విద్యాసంస్థలు ప్రాక్టికల్స్ పేరుతో విద్యార్థుల దగ్గర నుంచి ప్రత్యేకంగా డబ్బులు వసూళ్లు చేసి దానికి కూడా ఇంటర్ బోర్డు పరిశీలకులకు డబ్బులు ఇచ్చి కాపీయింగ్ కోసం పాల్పడ్డారని, సీసీ కెమెరాలను సైతం ఆఫ్ చేసి, సాంకేతికంగా పని చేయకుండా చేసి చిట్టీలు పెట్టి పరీక్షలు రాయించారని వారిపై పోలీస్ కేసు నమోదు చేయాలని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
40 పైగా క్యాంపస్‌లలో మాల్ ప్రాక్టీస్!
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రాక్టికల్స్‌ను పకడ్బందీగా నడిపే ఇంటర్ బోర్డు, కార్పోరేట్ కళాశాలలలో మాత్రం కాపీయింగ్ జరిగిన అక్కడ చీఫ్ అబ్జర్వర్స్‌ను తొలగించి చర్యలు తీసుకున్నామని చెప్పకుండా పోలీసులుతో కేసులు నమోదు చేయించాలని డిమాండ్ చేశారు. వరుసగా 3వ తేదీ, 4వ తేదీన 40 పైగా క్యాంపస్ లలో మాల్ ప్రాక్టీస్ జరిగితే ఇంటర్ బోర్డుకు పరీక్షలు పూర్తయిన తర్వాత చర్యలు తీసుకున్నామని ప్రకటించిందన్నారు. పబ్లిక్ పరీక్షలకు ముందు, తమ ర్యాంకుల కోసం పూర్తి స్థాయి మార్కులు తెచ్చుకునేందుకు కార్పొరేట్ కళాశాలలు చేసిన ఈ చర్యలను ప్రభుత్వం విచారణ జరిపి కొట్టిన చర్యలు తీసుకొని ఈ కళాశాలలను బ్లాక్ లిస్టులో పెట్టి అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఇంటర్మీడియట్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ జయప్రదకి వినతి పత్రం అందజేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో SFI రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం. మమత, హైదరాబాద్ జిల్లా కార్యదర్శి కె. అశోక్ రెడ్డి, మేడ్చల్ జిల్లా కార్యదర్శి కార్తీక్, రాష్ట్ర కమిటీ సభ్యులు లెనిన్, అవినాష్, జె. రమేష్, SFI నాయకులు నాగేందర్, ప్రశాంత్, ప్రవీణ్, ఆంజనేయులు, సాయి, నీరజ్, యశ్వంత్, కౌశిక్ తదితరులు పాల్గొన్నారు.






