- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరాబాద్లో మాస్ కాపీయింగ్.. స్క్వాడ్ రాకతో రోడ్డుపైకి పుస్తకాలు విసిరివేత
హైదరాబాద్ లో మాస్ కాపీయింగ్ కలకలం రేపింది.

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో మాస్ కాపీయింగ్ (Mass Copying) కలకలం రేపింది. పుస్తకాలు, స్లిప్స్, మొబైల్స్ ముందు పెట్టుకుని విద్యార్థులు పరీక్షలు రాస్తుండగా స్క్వాడ్ వస్తున్నారన్న సమాచారంతో ఆ బుక్స్ ను కాలేజీ కిటీకిల్లోంచి రోడ్డుపైకి విసిరేశారు. మలక్‍పేట (MalakPet) ఎంఎస్ కాలేజీలో (MS College) ఈ ఘటన జరిగింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ మాస్ కాపీయింగ్ నిన్న ఉస్మానియా యూనివర్సిటీ డిగ్రీ పరీక్షల సందర్భంగా జరిగినట్లు తెలుస్తోంది. నిన్న డిగ్రీ సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్, థర్డ్ ఇయర్ ఐదో సెమిస్టర్ పరీక్ష జరిగింది. పరీక్ష కేంద్రంలో పుస్తకాలు, చిట్టీలు, సెల్ ఫోన్లు పెట్టుకుని విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. ఈ క్రమంలో ఎగ్జామ్ సెంటర్‍ను తనిఖీ చేసేందుకు స్క్వాడ్ వస్తున్నారన్న సమాచారంతో విద్యార్థులంతా ఆందోళన చెందారు. వెంటనే తమ వద్ద ఉన్న పుస్తకాలను, స్లిప్స్ ను కాలేజీ కిటికీల్లోంచి బయటకు విసిరివేయగా అవి కాలేజీని ఆనుకుని ఉన్న రోడ్డుపై వెళ్తున్న వాహనదారులపై పడ్డాయి. ఉన్నట్టుండి తమపై బుక్స్ పడటంతో ఏం జరుగుతోందో తెలియక వాహనదారులు ఆందోళన చెందారు. వెంటనే కొంత మంది ఈ సీన్‍ను తమ సెల్ ఫోన్లలో రికార్డు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంఎస్ కాలేజీలో మాస్ కాపీయింగ్ వ్యవహారం కలకలం రేపుతోంది.






