- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Marwari: అవునందామా? కాదందామా?.. మార్వాడీ వివాదంలో రాజకీయ పార్టీలకు కొత్త చిక్కులు
తెలంగాణలో మార్వాడీ ఇష్యూ రోజు రోజుకు ఉధృతం అవుతున్నది.

దిశ, డైనమిక్ బ్యూరో : ‘మార్వాడీ గో బ్యాక్’ (Marwari Issue) రగడ అంతకంతకూ తీవ్రమవుతున్నది. తెలంగాణలోని స్థానిక వ్యాపారులపై గుజరాత్, రాజస్తాన్ మార్వాడీలు దౌర్జన్యం చేస్తున్నారంటూ ఓయూ జేఏసీ ఇవాళ బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆయా జిల్లాల్లో వర్తక సంఘాలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి. ఆమన్‌గల్, నల్లగొండ, భువనగిరి, చౌటుప్పల్ ప్రాంతాల్లో వ్యాపారస్తులు దుకాణాలను మూసివేశారు. ప్రధాన పట్టణాల్లోనూ షాపులు తెరుచుకోలేదు. అయితే ర్యాలీలు, ఆందోళనకు అనుమతి లేదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే పలువురు జేఏసీ నేతలు, ఆందోళనకారులను అరెస్టు చేశారు. ఓయూ జేఏసీ నేత కొత్తపల్లి తిరుపతి, వేణుగోపాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిన్న అర్థరాత్రే క్రాంతిదళ్ పృధ్వీరాజ్‌ను అరెస్టు చేసి తర్వాత వదిలిపెట్టారు. తెలంగాణ బచావ్ మూవ్‌మెంట్ వ్యవస్థాపకుడు పిడమర్తి రవితోపాటు తెలంగాణ శ్యామ్‌ను అరెస్టు చేశారు.
సైలెంట్ మోడ్‌లో బీఆర్ఎస్..
మార్వాడీల వ్యాపార ఆధిపత్యంపై నిరసనలు ఇప్పుడు రాజకీయానికి తెరతీశాయి. రాజకీయ రంగు పులుముకుంటున్న ఈ వివాదంలో పార్టీలు ఆచితూచి వ్యవహిస్తున్నాయి. మార్వాడీలకు మద్దతుగా బీజేపీ (BJP), కాంగ్రెస్ ముఖ్యనేతలు ప్రకటనలు చేశారు. బీజేపీ తరఫున కేంద్రమంత్రి బండి సంజయ్, రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు మార్వాడీలకు సపోర్ట్ చేయగా కాంగ్రెస్ (Congress) తరఫున టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, వీహెచ్ లాంటి వారు మార్వాడీలకు అండగా ఉంటామని చెప్పారు. అయితే రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ (BRS) మాత్రం ఈ వివాదంపై సైలెంట్ మోడ్‌లో ఉంటోంది. అయితే మార్వాడీలకు బీజేపీ, కాంగ్రెస్ మద్దతు తెలపడం పట్ల సొంత పార్టీల్లోనే విమర్శలు వస్తున్నాయి. తమ పొట్టకొడుతున్న మార్వాడీలకు తమ పార్టీ మద్దతు తెలపడం ఏంటని పలువురు వ్యాపారులు బహిరంగంగానే కామెంట్స్ చేస్తున్నారు. ఇక మార్వాడీలకు మద్దతుగా టీపీసీసీ చీఫ్ మాట్లాడుతుంటే కాంగ్రెస్ నేత పిడమర్తి రవి ఏకంగా తెలంగాణ బచావ్ మూవ్‌మెంట్‌ను ఎత్తుకున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక ప్రజలతో ముడిపడిన ఈ ఇష్యూలో ఆచితూచి వ్యవహరించకపోతే ఇబ్బందులు తప్పవనే చర్చ అన్ని పార్టీల్లో జరుగుతున్నట్లు తెలుస్తోంది. అందువల్లే ఆయా పార్టీల్లోని అగ్రనేతలు కాస్త సైలెంట్ అయ్యారా అనే చర్చ సాగుతోంది.
బీసీ ఉద్యమాన్ని డైవర్ట్ చేయడానికే..
రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ ఉద్యమాలను డైవర్ట్ చేయడానికే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలోని రెడ్డి, వెలమల దొరలు మార్వాడీ-గో బ్యాక్ ఉద్యమాన్ని రంగప్రవేశం చేయిస్తున్నారని ధర్మసమాజ్ పార్టీ వ్యవస్థాపకుడు విశారధన్ మాహారాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి వ్యాపారం లేని, దుకాణం లేని, అమాయక పేద ఎస్సీ, ఎస్టీ, బీసీలను ముందు పెట్టి కోమటోళ్లను వెనుకపెట్టి వారితో పైసలు పెట్టించి ఉద్యమాలు నడిపిస్తున్నారని ఆరోపించారు. ఈ పాలక అగ్రకుల పార్టీలు మార్వాడీలపై ఏ చర్యలు లేకుండా.. రోడ్లపై కొట్లాటలు పెట్టించి, అగ్గి రాజేసి దాంట్లో అమాయక బడుగు బలహీన వర్గాలను బలిచేస్తోందని మండిపడ్డారు.
ఇబ్రహీంపట్నంలో బైక్ ర్యాలీ..
దిశ, ఇబ్రహీంపట్నం : మార్వాడీ వ్యాపారులకు వ్యతిరేకంగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం కేంద్రంలో ఇవాళ ఉదయం పలు వ్యాపారస్తులు సాగర్ హైవే, మంచాల రోడ్డు, పాత బస్టాండ్ రోడ్డులో భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. మార్వాడీ హటావో తెలంగాణ బచావో, గో బ్యాక్ మార్వాడీ.. సేవ్ తెలంగాణ.. అంటూ నినాదాలు చేశారు. కాగా నేడు ఇబ్రహీంపట్నంలోని అన్ని రకాల వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారు.






