- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Marwadi go back: 'డిప్యూటీ సీఎం మా పెద్ద బావ'.. ‘మార్వాడీ గో బ్యాక్’ వివాదం వేళ సీన్ లోకి భట్టి పేరు
తెలంగాణలో ‘మార్వాడీ గో బ్యాంక్’ వివాదం మరింత ఉధృతంగా మారుతోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో 'మార్వాడీ వర్సెస్ లోకల్' వివాదం మరింత ముదురుతోంది. మార్వాడీ హఠావో- తెలంగాణ బచావో పేరుతో ఈ నెల 22న తెలంగాణ బంద్ కు వైశ్యవికాస వేదిక పిలుపునివ్వడం సంచలనంగా మారింది. తెలంగాణను విడిచి మార్వాడీలు వెళ్లిపోవాల్సిందేననంటూ పలు సంఘాలు ఆందోళనలు, ర్యాలీలు, సమావేశాలు నిర్వహిస్తుంటే దేశంలో ఎక్కడైనా నివసిస్తూ వ్యాపారాలు చేసుకునే హక్కు తమకు ఉందని రాజస్థాన్, గుజరాత్ నుంచి వచ్చిన వ్యాపారస్తులు తేల్చి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మార్వాడీ గో బ్యాక్ నినాదమిప్పుడు (Marwadi Go Back) క్రమంగా పొలిటికల్ టర్న్ గా తీసుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈ క్రమంలో గుజరాతీ తెలంగాణ సమాజం అధ్యక్షుడు దిగ్నేష్ జోషి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) మా పెద్ద బావ అంటూ కామెంట్ చేశారు. ఇప్పుడు మా అక్కను తీసుకుని గుజరాత్ కు వెళ్లిపోవాలా అని ప్రశ్నించారు. ఓ టీవీ డిబెట్ లో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
సీన్ లోకి భట్టి!:
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు సతీమణి నందిని మల్లు (Nandini Mallu) కుటుంబం గుజరాత్ నుంచి వచ్చి హైదరాబాద్ లో స్థిరపడింది. భట్టి విక్రమార్కతో ఓయూలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో వీరిద్దరు పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో గో మార్వాడీ ఉద్యమం ఊపందుకుంటున్న వేళ గుజరాతీ తెలంగాణ సమాజం అధ్యక్షుడు.. ఈ సీన్ లోకి భట్టి విక్రమార్కను తీసుకురావడం రాజకీయంగా మరింత ఆసక్తిగా మారింది. తమ విషయంలో జరుగుతున్న ఆందోళనలు, ప్రచారాలపై మార్వాడీలు భట్టిని కలిస్తే ఆయన వారికి ఎలాంటి హామీ ఇస్తారు అనేది ఉత్కంఠగా మారింది.






