ఊపందుకుంటున్న 'మార్వాడీ గో బ్యాక్' ఉద్యమం... రేపు తెలంగాణ బంద్

by Muthe.Rajitha |

ఉద్యమాల పురిటిగడ్డ తెలంగాణ ప్రస్తుతం మరో ఉద్యమాన్ని తలకు ఎత్తుకుంది.

ఊపందుకుంటున్న మార్వాడీ గో బ్యాక్ ఉద్యమం... రేపు తెలంగాణ బంద్
X

దిశ, వెబ్ డెస్క్ : ఉద్యమాల పురిటిగడ్డ తెలంగాణ ప్రస్తుతం మరో ఉద్యమాన్ని తలకు ఎత్తుకుంది. గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో 'మార్వాడీ గో బ్యాక్')Marwadi Go Back) ఉద్యమం బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే పలు తెలంగాణ వర్తక సంఘాలతోపాటు పలు ప్రజాసంఘాలు, మేధావులు ఈ ఉద్యమానికి గొంతు కలిపారు. ఈ క్రమంలోనే స్థానిక వ్యాపారులపై, ప్రజలపై గుజరాత్, రాజస్థాన్ మార్వాడీలు దౌర్జన్యం చేస్తున్నారంటూ రేపు తెలంగాణ బంద్(Telangana Bund) కు పిలుపునిచ్చింది OU JAC.

ఈ బంద్ కు అనేక వర్తక సంఘాలు, ప్రజాసంఘాలు తమ మద్దతు తెలుపుతూ.. బందులో పాల్గొంటామని ప్రకటించాయి. వరంగల్, నల్గొండ జిల్లాలోని పలు వ్యాపార సంస్థలు రేపటి బందులో పాల్గొంటున్నట్టు స్పష్టం చేశాయి. ఇదిలా ఉంటే తమపై విద్వేషపూరిత ప్రకటనలు చేస్తూ, అబద్దపు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మార్వాడీ వ్యాపారస్తులు తెలంగాణ డీజీపీ జితేందర్ రెడ్డికి ఫిర్యాదు చేసారు.

Next Story