- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య
ధర్మపురి మండలానికి చెందిన ఆలకొండ శ్రీవాణి (32) కుటుంబ కలహాల నేపథ్యంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది.

దిశ, వెల్గటూర్: ధర్మపురి మండలానికి చెందిన ఆలకొండ శ్రీవాణి (32) కుటుంబ కలహాల నేపథ్యంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. ఎస్సై ఉదయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. బోయినపల్లి మండలం విలాసాగరం గ్రామానికి చెందిన శ్రీవాణిని 15 సంవత్సరాల క్రితం ధర్మపురికి చెందిన అలకొండ సమ్మయ్యకు వివాహం చేసారు.
వివాహం తర్వాత కొద్ది కాలం భార్యాభర్తల మధ్య తలెత్తిన సమస్యలను పెద్దలు మధ్యస్తం చేసి పరిష్కరించారు. అయితే ఇటీవల బుధవారం పిల్లలతో జరిగిన గొడవ తర్వాత శ్రీవాణి ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకుని తన చీరతో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నది.
పక్కింటి వారు, బంధువులు గమనించి కిటికీ పగులగొట్టి ఆమెను బయటకు తీసి వెంటనే ధర్మపురి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
శ్రీవాణి మృతికి గల నిజమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. మృతురాలి తండ్రి సంపంగి నరసయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉదయ్ కుమార్ తెలిపారు.






