- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దయనీయ స్థితిలో పశువైద్యశాల..వర్షం నీటితో తడిచిపోయిన మందులు
ప్రభుత్వం ఓ వైపు వ్యవసాయాన్ని పండుగల చేస్తున్నామని ప్రకటనలు ఇస్తోంది. దాని కోసం వ్యవసాయానికి మూలాధారమైన

దిశ, మర్పల్లి : ప్రభుత్వం ఓ వైపు వ్యవసాయాన్ని పండుగల చేస్తున్నామని ప్రకటనలు ఇస్తోంది. దాని కోసం వ్యవసాయానికి మూలాధారమైన మూగజీవాలను రక్షించేందుకు పశు వైద్యశాలలు ఏర్పాటు చేసి వైద్యం అందిస్తోంది. కానీ ఉన్నాతాధికారుల పర్యవేక్షణ లోపం, ప్రభుత్వ వైఫల్యం వల్ల ప్రభుత్వ పశు వైద్యశాలలు దయనీయ స్థితిలో ఉన్నాయి. వ్యవసాయ పనుల్లో పశువులను కీలకపాత్ర పోషిస్తాయి. అలాంటి పశువులకు ఏవైనా వ్యాధులు సంక్రమిస్తే వైద్యశాలకు వైద్యం కోసం తీసుకు వస్తున్న రైతులకు చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి.
మరమ్మతులకు నోచుకోవడం లేదు..
కొన్ని వైద్యశాలలో కనీసం మరమ్మతులకు నోచుకోకపోవడంతో శిథిలావస్థకు చేరుతున్నాయి వర్షం కురిసినప్పుడల్లా భవనాలు ఉరుస్తున్నాయి. దీంతో మందులు తడిచి చెడిపోతున్నాయి. మర్పల్లి పశు వైద్యశాలలో గత మూడు రోజుల నుండి కురుస్తున్న వర్షాల వల్ల భవనం లోపల గొడుగు పట్టుకొని వైద్యం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. పశు వైద్యశాల లోని మందులు మొత్తం పూర్తిగా వర్షపు నీటితో తడిచి చెడిపోయాయి. ప్రతీ ఏడాది వర్షాకాలంలో ఈ సమస్యలు తప్పడం లేదు. వైద్యశాల పూర్తిగా శిథిలవస్థకు చేరింది. ఈ భవనం నిర్మించి సుమారు 53 సంవత్సరాలుగా గడుస్తుండటంతో ఈ పరిస్థితి ఎదురువుతోంది.
వైద్యం అందక వెనుతిరుగుతున్న రైతులు..
ఎంతో మంది రైతులు తమ పశువుల వైద్యం కోసం పశువుల ఆస్పత్రికి తీసుకు వచ్చి వైద్యం అందక వెనుతిరిగి పోతున్నారు. ఖరీదైన మందులు వర్షపు నీటి కారణంగా పూర్తిగా చెడిపోతున్నాయి. ఈ పశు వైద్యశాలలో సిబ్బంది కొరత కూడా ఉండడంతో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి ఈ సమస్యలను ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి నూతన భవనం కేటాయించి సరిపడా సిబ్బందిని కేటాయించాలని రైతులు కోరుతున్నారు.
కొత్త బిల్డింగుకు ప్రపోజల్ పెట్టాను : విజయ లక్ష్మి, పశు సంవర్ధక శాఖ ఏడీ
భవనం శిథిలావస్థకు చేరుకుందని వెంటనే కొత్త బిల్డింగ్ కేటాయించాలని నెల కిందటనే ఉన్నతాధికారులకు నివేదిక అందజేశాను. అప్పటివరకు లోకల్ లీడర్లకు ఏదైనా భవనం చూపించాలని కోరగా పట్టించుకోలేదు. దీంతో వర్షం పడినప్పుడల్లా మందులు చెడిపోతున్నాయి. ఇది వరకే కొత్త పశు వైద్యశాల నిర్మించి ఉన్నారు. అది కేటాయిస్తే పశువులకు వైద్యం చేసేందుకు సులువుగా ఉంటుంది.






