గంజాయి పట్టివేత

by Elthuri vijay kumar |   (  Updated:2025-09-13 10:38:24  IST  )

- ఇద్దరు అరెస్టు, రూ.90వేల విలువైన సరుకు స్వాధీనం

గంజాయి పట్టివేత
X

గంజాయి పట్టివేత

- ఇద్దరు అరెస్టు, రూ.90వేల విలువైన సరుకు స్వాధీనం

దిశ, మంగపేట : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సీలేరు నుంచి మంగపేట మండలానికి గంజాయిని తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసి రూ.90 వేల విలువ గల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఏటూరునాగారం సీఐ అనుముల శ్రీనివాస్, ఎస్సై తిరునగరి వెంకటరంగ సూరి తెలిపారు. శనివారం పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నిందితులను హాజరుపర్చి వివరాలు వెల్లడించారు. ఈ నెల 12న సాయంత్రం మండలంలోని బ్రాహ్మణపల్లి చెక్ పోస్టు వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా ఆటోలో సతీష్, సాగర్, ఖలీమ్, దుర్గా ప్రసాద్, శ్రీనాథ్ అనే వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని పట్టుకోని విచారించి తనిఖీ చేయగా వారి వద్ద 1 కేజీ 820 గ్రాముల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.గంజాయి విలువ మార్కెట్లో రూ.90 వేలు ఉంటుందని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందిన సతీష్, సాగర్, ఖలీమ్, దుర్గా ప్రసాద్, శ్రీనాథ్ ఒక టీంగా ఏర్పడి సీలేరు నుంచి గంజాయిని తీసుకు వచ్చి మణుగూరు చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు మంగపేట మండలంలోని రమణక్కపేటకు చెందిన శ్రీను అనే వ్యక్తి అమ్మడానికి వస్తూ పట్టుపడినట్లు తెలిపారు. వారి నుండి ఆటో, ఫోన్ స్వాధీనం చేసుకున్నామన్నారు. మండలంలో ఎవరైనా గంజాయి అమ్మినా, తాగినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. గంజాయి గురించి సమాచారం ఇచ్చినవారికి తగిన పారితోషికం అందజేయనున్నట్లు సీఐ, ఎస్సై తెలిపారు. చాకచక్యంగా గంజాయి ముఠాను పట్టుకున్న ఎస్సై టీవీఆర్ సూరిని ఎస్పీ శభరీష్, సీఐ శ్రీనివాస్అ భినందించారు. సమావేశంలో హెడ్ కానిస్టేబుల్ కాంతారావు, చంద్రమోహన్ సిబ్బంది పాల్గొన్నారు.

Next Story