- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టెట్ మినహాయింపు కోరుతూ ఫిబ్రవరి 5న ఢిల్లీలో మార్చ్ టు పార్లమెంట్
సీనియర్ ఉపాధ్యాయులను ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నుండి మినహాయించాలని, ప్రభుత్వ విద్యకు నష్టం కలిగించే జాతీయ విద్యా విధానం (ఎన్ఈపి) ని రద్దు చేయాలని పలు ఉపాధ్యాయ సంఘాల నేతలు పిలుపునిచ్చారు.

- జనవరి 9న నల్లబ్యాడ్జీలతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, రాష్ట్రపతికి విజ్ఞాపన పత్రాల సమర్పణ
- ఐక్య ఉద్యమంలో అన్ని ఉపాధ్యాయ సంఘాలు కలిసి రావాలి
- ఏఐ జాక్టో రౌండ్ టేబుల్ సమావేశం పిలుపు
దిశ, తెలంగాణ బ్యూరో: సీనియర్ ఉపాధ్యాయులను ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నుండి మినహాయించాలని, ప్రభుత్వ విద్యకు నష్టం కలిగించే జాతీయ విద్యా విధానం (ఎన్ఈపి) ని రద్దు చేయాలని, పాఠశాలల మూసివేత, విలీనాలను ఆపాలని పలు ఉపాధ్యాయ సంఘాల నేతలు పిలుపునిచ్చారు. బుధవారం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎఐ జాక్టో స్టీరింగ్ కమిటీ సభ్యుడు, ఎస్టియు రాష్ట్ర అధ్యక్షుడు జి సదానందం గౌడ్ అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్పిఎస్, సిపిఎస్ లను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. ప్రాథమిక ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుహక్కు కల్పించాలని తదితర డిమాండ్లతో అఖిల భారత ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ (ఎఐ జాక్టో) ఆధ్వర్యంలో ఫిబ్రవరి 5న ఢిల్లీలో నిర్వహిస్తున్న పార్లమెంటు మార్చ్ ను విజయవంతం చేయాలన్నారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చి నాలుగు నెలలు గడిచినా కేంద్ర ప్రభుత్వం గానీ, జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటిఈ) గానీ ఏమాత్రం స్పందించకుండా మౌనంగా ఉండడాన్ని సమావేశం తీవ్రంగా ఖండించింది. తక్షణమే కేంద్రం సుప్రీం కోర్టులో రివ్యూ లేదా క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేయాలని, లేదా సీనియర్ ఉపాధ్యాయులకు రక్షణ కల్పించే విధంగా విద్యా హక్కు చట్టాన్ని సవరించాలని సమావేశం డిమాండ్ చేసింది. ఈ నెల 9న రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులంతా నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై నిరసన తెలపాలని, అన్ని జిల్లాల నుండి రాష్ట్రపతికి, ప్రధాన మంత్రికి మెమోరాండంలు పోస్టు చేయాలని, ఫిబ్రవరి 5న ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో ఢిల్లీ వెళ్ళి పార్లమెంట్ మార్చ్ నిరసన ప్రదర్శనలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
జాతీయ స్థాయిలో పోరాటం
ఉపాధ్యాయ, విద్యా రంగ సమస్యల పరిష్కారం కోసం జాతీయ స్థాయిలో ఐక్యంగా పోరాడాలని అఖిలభారత ఉపాధ్యాయ సంఘాలు స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్టిఎఫ్ఐ), ఆల్ ఇండియా సెకండరీ టీచర్స్ ఫెడరేషన్ (ఎఐఎస్టిఎఫ్), ఆల్ ఇండియా ప్రైమరీ టీచర్స్ ఫెడరేషన్ (ఎఐపిటిఎఫ్), ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ ఎలిమెంటరీ టీచర్స్ ఆర్గనైజేషన్స్ (ఎఐఎఫ్ఇటిఒ) లు నిర్ణయించాయి. ఆమేరకు అఖిల భారత ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ (ఏఐజాక్టో) ఏర్పాటైందని, ఇతర జాతీయ ఉపాధ్యాయ ఫెడరేషన్లు ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ఎడ్యుకేషనల్ అసోసియేషన్స్(ఐఫియా), ఆల్ ఇండియా సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ (ఎఐఎస్ఈసి), ఆల్ ఇండియా ఫోరం ఫర్ రైట్ టు ఎడ్యుకేషన్ (ఎఐఎఫ్ఆర్టిఈ), జాయింట్ ఫోరం ఫర్ మూవ్ మెంట్ ఆన్ ఎడ్యుకేషన్ (జెఎఫ్ఎంఈ), ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (ఎఐఎస్జిఈఎఫ్) ఈ పోరాటానికి మద్దతు ఇస్తున్నాయని ఎఐ జాక్టో స్టీరింగ్ కమిటీ సభ్యుడు, టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి తెలిపారు. టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ వెంకట్, ఎస్టియు ప్రధాన కార్యదర్శి జుట్టు గజేందర్, పిటిఎ టిజి అధ్యక్షుడు మల్లికార్జున్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె శారద, ఎఐఎఫ్ఇటిఒ జాతీయ కార్యదర్శి పోల్ రెడ్డి, టిఆర్ టిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కటకం రమేశ్, టిపిటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ తిరుపతి, టిఎస్టియు అధ్యక్షుడు మొహమ్మద్ అబ్దుల్లా, డిటిఎఫ్ నాయకులు రామకృష్ణ, సుటా అధ్యక్షుడు ఎంఎ నయీమ్ తదితర నాయకులు పాల్గొన్నారు.






