Maoist pandu: మావోయిస్టు అగ్రనేత పాండు సేఫ్.. చనిపోయిన వ్యక్తి ఎవరంటే?

by Prasad Jukanti |   (  Updated:2025-01-23 11:45:52  IST  )

మావోయిస్టు అగ్రనేత పాండు సేఫ్ గా ఉన్నారు.

Maoist pandu: మావోయిస్టు అగ్రనేత  పాండు సేఫ్..  చనిపోయిన వ్యక్తి ఎవరంటే?
X

దిశ, డైనమిక్ బ్యూరో: మావోయిస్టు పార్టీ కీలక నేత, ఛత్తీస్ గఢ్ స్టేట్ కమిటీ సభ్యుడు చంద్రహాస్ అలియాస్ పాండు (Maoist pandu) సేఫ్ గా ఉన్నారు. గరియాబంద్ ఎన్ కౌంటర్ (gariaband encounter) లో ఆయన మృతి చెందారంటూ ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా ఈ ఎన్ కౌంటర్ లో చనిపోయిన వారి వివరాలను పోలీసులు ప్రకటించారు. ఇందులో పాండు వివరాలను పేర్కొనలేదు. ఎన్ కౌంటర్ లో చనిపోయిన పాండుగా భావిస్తున్న వ్యక్తి సత్యం గావ్ డే అని అతడు ధమ్ తరీ-గరియాబంద్-నౌపాడా డివిజనల్ కమిటీ కార్యదర్శి, ఒరిస్సా రాష్ట్ర కమిటీ సభ్యుడని, అతడి స్వస్థలం ఛత్తీస్ గఢ్ కాంకేర్ జిల్లా ఉప్పర్ పారా గ్రామంగా పోలీసులు పేర్కొన్నారు. కాగా గరియాబంద్ అటవీ ప్రాంతంలో ఈ నెల 19న జరిగిన ఎన్ కౌంటర్ లో 16 మంది మావోయిస్టులు మృతి చెందగా బుధవారం మరో రెండు మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

ఎన్ కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టుల వివరాల కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి

Next Story