మావోయిస్టులు మా రక్తమే.. అమిత్ షా వ్యాఖ్యలపై కూనంనేని హాట్ కామెంట్స్

by Prasad Jukanti |

మావోయిజంపై లోక్ సభలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శలు గుప్పించారు.

మావోయిస్టులు మా రక్తమే.. అమిత్ షా వ్యాఖ్యలపై కూనంనేని హాట్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కమ్యూనిజం ఉన్నంత వరకు మావోయిజాన్ని అంతం చేయలేరని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (Kunamneni Sambasiva Rao) అన్నారు. అర్బన్ నక్సల్స్ పేరుతో మేధావులను ఇబ్బంది పెడితే తాము చేసిన చట్టాలే తమక ఉరితాడు అవుతుందని హెచ్చరించారు. ఇవాళ హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా న్యాయవ్యవస్థను బెదిరించేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రెండు రోజుల క్రితం లోక్ సభలో మాట్లాడిన అమిత్ షా (Amit Shah).. సల్వాజుడుంపై జస్టిస్ సుదర్శన్ రెడ్డి సభ్యుడిగా ఉన్న ధర్మాసనం తీర్పును తప్పుపట్టారు. అమిత్ షా చేసిన ఈ వ్యాఖ్యలపై కూనంనేని మండిపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యలు హోంశాఖ స్థాయిలోని వ్యక్తికి తగవన్నారు.

మావోయిస్టులు మా రక్తమే:

ఈ దేశంలో మావోయిజం లేకుండా చేశామని అమిత్ షా సంబరపడుతున్నారని కానీ మావోయిజనానికి మూలం కమ్యూనిజం అని, మావోయిస్టులు మా రక్తమేనన్నారు. అందువల్ల అందువల్ల మావోయిజాన్ని అంతం చేయలేరు అణిచివేయలేరన్నారు. మావోయిజాన్ని భౌతికంగా అంతం చేయగలరేమే కానీ ప్రశ్నించే తత్వాన్ని అంతం చేయజాలరన్నారు. కుల వ్యవస్థను కొనసాగించే కుట్రలో భాగంగానే సుప్రీంకోర్టు మత మార్పిడిపై తీర్పు ఇచ్చిందన్నారు. దక్షిణాదికి నష్టం చేకూరేలా డీలిమిటేషన్ చేస్తున్నారని దీనిపై మేధావులతో కమిటీ వేయాలని సూచించారు.

Next Story